ప్రతినాయక పాత్రలకు సిద్ధం : బాలకృష్ణ

22 Sep, 2018 11:06 IST|Sakshi

టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఇమేజ్‌ ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వంద సినిమాల మైలు రాయిని దాటిన ఈ నందమూరి నటసింహా ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

యంగ్ హీరో రానాతో కలిసి రెడ్‌ కార్పెట్‌ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తాను కూడా ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు సిద్ధమన్నారు. అయితే తాను నెగెటివ్ రోల్స్‌ చేస్తే తన మీద అభిమానులు కేసుల పెడతారేమో అంటూ నవ్వులు పూయించారు. దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ కేటగిరిలో అవార్డ్‌ను అందుకున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఎవరికీ చెప్పొద్దు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఎవరికీ చెప్పొద్దు!

నువ్వు మాస్‌రా...