ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే..

23 May, 2015 13:09 IST|Sakshi
ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే..

నట సింహం బాలకృష్ణ కెరీర్లో  ఎత్తులతో పాటు పల్లాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్తో చెలరేగిపోయి.. అట్టర్ ప్లాప్స్లో పడిపోయిన సందర్భాలు అనేకం. సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవటానికి బాలకృష్ణకు చాలా సమయం పట్టింది. ఆ అల్టిమేట్ హిట్ ఇచ్చింది దర్శకుడు బోయపాటి శ్రీను. ఆ సినిమా పేరు.. సింహా. బాలయ్య సింపుల్గా డైలాగ్ చెప్పినా డైనమేట్ లా పేలుతుందని బోయపాటి సింహాతో రుజువు చేశాడు. బాలయ్య కెరీర్లో సరికొత్త అధ్యాయం రాశాడు.  

సింహాలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టే బోటపాటికి బాలకృష్ణ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. రెండోసారి కూడా అదే రిపీటైంది. లెజెండ్ హిట్ అయింది. బాలయ్య ఇమేజ్ రేంజ్ని సరిగ్గా క్యాచ్ చేశాడు కాబట్టే బోయపాటి రెండు హిట్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. డెఫినెట్గా కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఇచ్చిన రెండు అవకాశాల్నీ బోయపాటి సమర్థవంతంగా డీల్ చేశాడు. అందుకే బాలయ్య 100 సినిమా కూడా ఈ డైరెక్టర్ చేతికి చిక్కింది. ఆ గోల్డెన్ ఛాన్స్ బోయపాటికే దక్కింది. బాలయ్య వందో సినిమా గురించి ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టాడట బోయపాటి. అయితే నటసింహం 99వ సినిమాని శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కబోతుంది. ఇది పూర్తి  కాగానే బాలయ్య సెంచరీ కొట్టేందుకు సిద్ధం అవున్నాడు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా