అంతా వైవిధ్యమే!

19 Feb, 2014 23:04 IST|Sakshi
అంతా వైవిధ్యమే!

 ‘‘చాలా ఆసక్తికరమైన చిత్రమిది. నా పాత్ర తీరుతెన్నులు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశమూ వైవిధ్యమే. నా కెరీర్‌కి ఇదొక గొప్ప మలుపు అవుతుంది’’ అని రాజా గౌతమ్ చెప్పారు. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బసంతి’. రాజా గౌతమ్, అలీషా బేగ్ ఇందులో హీరో హీరోయిన్లు. మహా శివరాత్రి కానుకగా ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్య దంతులూరి మాట్లాడుతూ -‘‘దర్శకునిగా నా తొలి సినిమా ‘బాణం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ ‘బసంతి’ కచ్చితంగా క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది. కథా కథనాలు, సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.