పుత్రోత్సాహం

20 May, 2018 00:51 IST|Sakshi
రుద్ర , అరవింద్‌ సామి

పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు ఏదైనా సాధించినప్పుడు కలుగుతుంది అని సుమతీ శతకం చెబుతుంది. అరవింద్‌ సామి కూడా ఇప్పుడు ‘పుత్రోత్సాహాన్ని’ ఆస్వాదిస్తున్నారు. ఆయన కుమారుడు రుద్ర ఐబీ ప్రోగ్రామ్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ అయ్యారు. ఆ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటూ – ‘‘ఐబీ ప్రోగ్రామ్‌ నుంచి మా అబ్బాయి గ్రాడ్యుయేట్‌ అయినందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఈ మైల్‌స్టోన్‌ రీచ్‌ అయిన అందరికీ కంగ్రాట్స్, ఆల్‌ ది బెస్ట్‌. ‘నీ లైఫ్‌ను హ్యాపీగా, ప్రేమతో, ప్రశాంతంగా, నిజాయితీగా, సమగ్రతతో లీడ్‌ చేయాలని కోరుకుంటున్నాను.

ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండు. పెద్ద పెద్ద కలల్ని కను. గుర్తుపెట్టుకో.. పతీదీ పాజిబులే’’ అని రుద్రకు నాలుగు మంచి మాటలు చెప్పారు అరవింద్‌ సామి.  ఐబీ (ఇంటర్నేషనల్‌ బ్యాకులోరియట్‌) డిగ్రీ చాలా ప్రెస్టీజియస్‌ గ్లోబల్‌ డిగ్రీ. ఐబీ ఫాలో అయ్యే స్కూల్స్‌ అందరూ గ్లోబల్‌ సిలబస్‌ ఫాలో అవుతుంటారు. కేవలం ఎడ్యుకేషన్‌ మాత్రమే కాకుండా టైమ్‌ మేనేజ్‌మెంట్, రియల్‌ వరల్డ్‌ స్కిల్స్‌ ఇలా ప్రతీదాంట్లో స్టూడెంట్స్‌ను ట్రైన్‌ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగే పర్ఫెక్ట్‌ సిటిజన్‌గా తీర్చిదిద్దుతారు. ఇలాంటి ప్రెస్టీజియస్‌ డిగ్రీను కొడుకు సంపాదించాడు అంటే పుత్రోత్సాహమే కదా.6

మరిన్ని వార్తలు