రెండో రోజు పెరిగిన కలెక్షన్లు

12 Dec, 2016 14:24 IST|Sakshi
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు

ముంబై: రణవీర్‌ సింగ్‌, వాణి కపూర్‌ నటించిన బాలీవుడ్‌ సినిమా బేఫికర్‌కు రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు 10.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు శనివారం 11.60 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజుల్లో మొత్తం 21.96 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఈ సినిమాలో రణవీర్‌ సింగ్‌, వాణి కపూర్‌ లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా 2100 స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా మంచి వసూళ్లు రాబడుతోంది.