మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా

6 Oct, 2019 00:18 IST|Sakshi
అన్నయ్య సాయిశ్రీనివాస్, తండ్రి సురేష్, తల్లి పద్మతో బెల్లంకొండ గణేష్‌

– బెల్లంకొండ గణేష్‌

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెల్లంకొండ సురేష్‌ రెండో కుమారుడు గణేష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం శనివారం హైదరా బాద్‌లో ప్రారంభమైంది. బీటెల్‌ లీఫ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పవన్‌ సాదినేని దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయి శ్రీనివాస్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు వీవీ వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘నన్ను బెల్లంకొండ సురేశ్‌ దర్శకునిగా పరిచయం చేస్తే, వాళ్ల పెద్దబ్బాయి సాయిని నేను హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు గణేష్‌ హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ‘బ్రోచేవారెవరురా’ చిత్రదర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం’’ అన్నారు. ‘‘మా అబ్బాయిని నేనే లాంచ్‌ చేద్దామనుకున్నాను. కానీ, బెక్కం వేణు, పవన్‌ సాదినేని మంచి కథతో వచ్చారు’’ అన్నారు బెల్లంకొండ సురేష్‌.

బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాము. గణేష్‌ ఈ కథకు సరిపోతాడని భావించి సురేష్‌గారికి చెప్పటంతో ఆయనకు కథ నచ్చి సరే అన్నారు’’ అని చెప్పారు. గణేష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఎమోషనల్‌ అయ్యాను. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి కారణమైన నా ఫ్యామిలీకి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘నా తమ్ముడు హీరోగా పరిచయం అవటం సంతోషంగా ఉంది. మంచి కథతో హీరోగా లాంచ్‌ అవుతున్నాడు’’ అన్నారు సాయి శ్రీనివాస్‌. పవన్‌ సాదినేని మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం. గణేశ్‌ ఈ కథకు కరెక్ట్‌గా సెట్‌ అయ్యాడు. రథన్‌ సంగీతం, కార్తీక్‌ ఘట్టమనేని కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ చిత్రానికి మాటలు రాస్తున్నాను’’ అన్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

తలైవికి తలైవర్‌ రెడీ

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

వితిక చేసిన పనికి షాకయిన నాగార్జున!

వారెవ్వా ‘వార్‌’... కలెక్షన్ల తుఫాన్‌!

సైరాకు భారీగా కలెక్షన్స్‌.. 3రోజుల్లోనే వందకోట్లు!

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

‘చాణక్య’ మూవీ రివ్యూ

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం

డాటరాఫ్‌ శకుంతల

వెనక్కి వెళ్లేది లేదు

అమెరికా కాల్పులతో...

ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం

వెరైటీ మాస్‌

సైరా సెలబ్రేషన్స్‌

పదిహేడేళ్లకే ప్రేమలో పడ్డా

రీల్‌ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా!

వార్‌ టీం సక్సెస్‌ పార్టీ..

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

రజనీ రఫ్ఫాడిస్తారంటున్న అభిమానులు..

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్క శర్మ లవ్‌ ఎఫైర్స్‌..!

ఆసక్తికరం; గవర్నర్‌తో చిరంజీవి భేటీ

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!