‘సీత’ నుంచి ఫస్ట్‌ లుక్‌!

26 Jan, 2019 11:39 IST|Sakshi

బెల్లంకొండ శ్రీనివాస్‌ హిట్‌ కోసం ప్రయత్నిస్తూ.. వరుసగా సినిమాలను చేస్తున్నాడు. రీసెంట్‌గా కవచం మూవీతో పలకరించినా.. ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. ఆయన హీరోగా నటిస్తున్న ‘సీత’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ శ్రీనివాస్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చిన డైరెక్టర్‌ తేజ.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో ‘సీత’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండ హీరోకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీకి అనూప్‌రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు