లవ్‌ అండ్‌ యాక్షన్‌

30 Nov, 2019 00:29 IST|Sakshi
నభా నటేశ్, సాయి శ్రీనివాస్, వీవీ వినాయక్‌

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఇందులో నభా నటేష్‌ కథానాయికగా నటిస్తున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు.  నిర్మాత ‘దిల్‌’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నాం. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలో సాయి శ్రీనివాస్‌ కనిపిస్తాడు. తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డిసెంబర్‌ 6న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్, దుబాయ్‌లో చిత్రీకరణ జరపనున్నాం.

వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘కందిరీగ’ సినిమా నుంచి సంతోష్‌ పరిచయం. తనతో పని చేయడం నా కుటుంబ సభ్యులతో చేసినట్టుగా ఉంది. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్, పద్మగార్లకి ధన్యవాదాలు. ఏ మాత్రం రాజీ పడకుండా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘సాయిశ్రీనివాస్‌తో పని చేయడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర పోషించనుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నభా నటేష్‌. ‘‘బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు పని చేశాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు కెమెరామేన్‌ డుడ్లీ. ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల మాట్లాడారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా