అల్లుడు అదుర్స్‌

13 Mar, 2020 05:34 IST|Sakshi

‘అల్లుడు శీను’తో కెరీర్‌ ప్రారంభించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన ఎనిమిదో సినిమా టైటిల్‌ను ‘అల్లుడు అదుర్స్‌’గా ఖరారు చేశారు. నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కందిరీగ’, ‘రభస’ చిత్రాల దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించి, సాయి శ్రీనివాస్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘వేసవిలో ప్రేక్షకులను అలరించే ఆహ్లాదకరమైన సినిమా ఇది’’ అని చిత్రబృందం తెలిపింది. ఏప్రిల్‌ 30న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు.   

మరిన్ని వార్తలు