బియాన్స్‌... బడ్జెట్‌ అదుర్స్‌

15 Dec, 2018 00:18 IST|Sakshi
హాలీవుడ్‌ సింగర్‌ బియాన్స్‌

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ కూతురి పెళ్లి సంబరాలు ఇటీవల జరిగిన విషయాన్ని వినే ఉంటారు. ఇండియన్‌ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్‌ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు అంబానీ. కేవలం వెడ్డింగ్‌ పార్టీల కోసమే సుమారు వంద మిలియన్‌ డాలర్లను కార్లో పెట్రోల్‌లా ఖర్చు పెట్టారట ఆయన.

ఈ ఫంక్షన్‌లో హాలీవుడ్‌ సింగర్‌ బియాన్స్‌ కనిపించడం విశేషం. ఎందుకంటే బియాన్స్‌ ఒక్క ప్రైవేట్‌ పార్టీకి సుమారు 3–4 మిలియన్‌ డాలర్స్‌ (దాదాపు 20 కోట్ల రూపాయలు) అందుకుంటారట. 2017లో మ్యూజిక్‌ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించిన సింగర్‌గా బియాన్స్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె అంబానీ పార్టీ కోసం ఎంత తీసుకున్నారంటే.. సుమారు 28 కోట్లు పుచ్చుకున్నారని టాక్‌.

మరిన్ని వార్తలు