‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

29 Sep, 2019 11:09 IST|Sakshi

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ సమర్పణలో  వలజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మాతలుగా, వలజ క్రాంతి దర్శకత్వంలో ప్రదీప్ వలజ, మిధున ధన్పాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ముందుగా ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి న్యూ కమర్స్ ట్రూ స్టోరీస్‌తో వస్తున్నారు. ఇది అభినందించవలసిన విషయం. భగత్ సింగ్ నగర్ అనగానే నాకు విజయవాడ గుర్తొచ్చింది. లవ్ థ్రిల్లర్ స్టోరీ అని విన్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.

దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. ‘కొత్త వాడిని అయినా, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇక సినిమా విషయానికి వస్తే... భగత్ సింగ్ నగర్ అనే స్లమ్ ఏరియాలో జరిగే లవ్ స్టోరీతో మొదలై థ్రిల్లర్‌గా టర్న్ అయ్యే చిత్రం. ఇక నిర్మాత రమేష్ గారు కేవలం డబ్బు పెట్టడమే కాదు.. నేను స్ట్రెస్‌లో ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేసేవారు. ఆయన లేకపోతే నేను ఈ వేదిక లేదు. ఓ మంచి సినిమా చేసాము ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.

హీరో ప్రదీప్ వలజ మాట్లాడుతూ... ‘ముంబయిలో యాక్టింగ్ కోర్సు చేసాను. మా నాన్న మునిచంద్ర గారే దగ్గరుండి చేర్పించారు. ఇలా పేరెంట్స్ సపోర్ట్ ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకు నేను మానాన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక యాక్టింగ్ కోర్సు అవగానే అవకాశం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ కష్టం లేకుండానే మా అన్నయ్య క్రాంతినే డైరెక్ట్ చేసి అవకాశం ఇచ్చాడు. కానీ షూటింగ్ టైంలో మాత్రం చాలా కష్టపెట్టాడు. మా కష్టానికి తగ్గట్టు సినిమా బాగోచ్చింది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. 

హీరోయిన్ మిధున ధన్ పాల్ మాట్లాడుతూ.. ‘మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ అయ్యింది. తెలుగులో నా మొదటి సినిమా ఇది. అందరూ ఎంతో సహకరించారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’ అన్నారు. 

నిర్మాత రమేష్ మాట్లాడుతూ... ‘ఎన్ ఆర్ ఐ అంటే ఏమీ తెలియదు అనుకుంటారు. కానీ మేము వెళ్ళేది కూడా ఇక్కడ నుంచే కదా.. అందులోనూ నేను ఒక బిజినెస్ మ్యాన్‌ను. నాకు తెలిసింది రెండే ఒకటి సక్సెస్, మరోటి ఫెయిల్యూర్. కనుక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. మంచి సినిమా చేసాను అనే ఫీలింగ్ నాకుంది’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు