ప్ర‌భాస్‌ సినిమాలో 'మైనే ప్యార్ కియా' న‌టి

14 May, 2020 10:29 IST|Sakshi

భాగ్య‌శ్రీ.. ఈ పేరు ఇప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క పోయినా.. స‌ల్మాన్  న‌టించిన‌ మైనే ప్యార్ కియా సినిమా చూసిన వాళ్ల‌కు మాత్రం త‌ప్ప‌కుండా గుర్తుంటుంది. మైనే ప్యార్ కియాలో హీరోయిన్‌గా న‌టించి ఉత్త‌మ న‌టిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు భాగ్య‌శ్రీ.  న‌టించిన మొద‌టి సినిమానే భాగ్య శ్రీకి స్టార్‌డ‌మ్‌ను తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత అనేక సినిమాలు కొన్ని సీరియ‌ళ్ల‌లో కూడా ఆమె న‌టించారు. అయితే కొన్ని సినిమాలతో ఆమెకు స‌రైన గుర్తింపు రాక‌పోవ‌డంతో కొంత కాలంగా భాగ్య‌శ్రీ సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. 51 ఏళ్ల ఈ న‌టి మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించేందుకు సిద్ధం అవుతున్నారు. (బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త‌..! )

ఇటీవ‌ల ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో భాగ్య‌శ్రీ ఈ వివరాలు వెల్ల‌డించారు. లాక్‌డౌన్‌కు ప్ర‌క‌టించ‌క‌ముందే సినిమా షూటింగ్‌లు పాల్గొన్న‌ట్లు తెలిపారు. రెండు మూడు సినిమా స్క్రిప్ట్‌లు వింటున్న‌ట్లు, ఇప్ప‌టికే సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించిన‌ట్లు పేర్కొన్నారు. వాటిలో ఒక‌టి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో చేస్తున్న‌ట్లు ఈ న‌టి తెలిపారు. అయితే ఏ సినిమా అనేది మాత్రం ఆమె వెల్ల‌డించ‌లేదు. ప్ర‌భాస్ సినిమాలో ఆస‌క్తిక‌ర పాత్ర పోషిస్తున్నట్లు, ఇందుకు  న‌ట‌న‌లో కొంత శిక్ష‌ణ తీసుకోవాల్సి ఉంద‌న్నారు.
(అది తల్చుకుంటేనే వణికిపోతున్నాను: నటి)

ప్ర‌భాస్‌తో న‌టిస్తున్న‌ట్లు భాగ్య శ్రీ చెప్ప‌డంతో ఏ పాత్ర‌లో న‌టిస్తుంద‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ప్ర‌భాస్‌కు తల్లిగా ఆమె న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మైనే ప్యార్ కియాతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన భాగ్య శ్రీ.. సల్మాన్ ఖాన్, చిత్ర దర్శకుడు  సూరజ్‌ బర్జాత్యా సమక్షంలో హిమాలయ దసాని అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు దస్సాని అనే కుమారుడు, అవంతిక దాసాని అనే కుమార్తెకు ఉన్నారు. (ప్రేయ‌సిని పెళ్లాడిన హీరో నిఖిల్ )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు