అలా అన్నాడంటే ఫ్రాడ్‌ లేదా పిచ్చోడు అయ్యుండాలి

25 Nov, 2018 06:01 IST|Sakshi
∙ఐరా, ధనుంజయ్, సిరాశ్రీ, రామ్‌గోపాల్‌ వర్మ, అభిషేక్, సిద్ధార్థ, భాస్కర్‌

రామ్‌గోపాల్‌ వర్మ

‘‘భైరవగీత’ నాకు చాలా స్పెషల్‌ మూవీ. నేను ఇన్నేళ్లలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా చేయడంతోపాటు చాలా చిత్రాలు నిర్మించాను. డైరెక్షన్‌ అంటే ఓవరాల్‌ ఎఫెక్ట్‌ అనుకుంటారు అందరూ. కానీ ఉన్న మెటీరియల్‌ను ఉపయోగించి సినిమాటిక్‌ యాంగిల్‌లోకి మార్చేవాడే నిజమైన దర్శకుడు అని నా భావన’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సిద్ధార్థ తాతోలుని దర్శకునిగా పరిచయం చేస్తూ రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై  అభిషేక్‌ నామా, భాస్కర్‌ రాశి నిర్మించిన చిత్రం  ‘భైరవ గీత’.

ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘సిద్ధార్థ నా దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. అప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడు. అతను ఇంటిలిజెంట్‌. కడప వెబ్‌ సిరీస్‌ గురించి డిస్కస్‌ చేస్తూ ఉంటే సిద్ధార్థ ఆ ట్రైలర్‌ను నేను చేస్తానన్నాడు. సిద్ధూ అ సినిమా ఎలా చేస్తాడనే డౌట్‌ ఉండేది. నువ్వు నిజంగా చేయగలుగుతావా? అని కూడా అడిగాను. ఎవరైనా చేయలేని పని చేస్తాను అన్నాడంటే వాడు ఫ్రాడ్‌ అన్నా అయ్యుండాలి లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. అతను పిచ్చోడు కాదు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ రష్‌ చూసి షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా కూడా తీయొచ్చా అనిపించింది. అది నాకొక లెసన్‌. డైరెక్షన్‌ అనుభవం లేకుండా చేయటమనేది రేర్‌గా జరుగుతుంది.

నా టైమ్‌లో నేను, మణిరత్నం, శేఖర్‌ కపూర్‌ ఎక్కడా అసిస్టెంట్స్‌గా చేయలేదు. ‘భైరవగీత’ కష్టంతో కూడుకున్న సినిమా. 90 శాతం కొత్తవాళ్లతో తీసిన చిత్రం’’ అన్నారు. సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్‌ చదివిన నేను సినిమాల్లోకి వెళతాను అనగానే నన్ను సపోర్ట్‌ చేసిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాముగారికి థ్యాంక్స్‌ చెప్పి ఇచ్చిన చాన్స్‌ని చిన్నదిగా చేయదలచుకోలేదు. హీరో ధనుంజయ్‌ను ఈ సినిమా తర్వాత అందరూ భైరవా అని పిలుస్తారు. హీరోయిన్‌ ఐరా మోర్‌తో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. అభిషేక్‌ గారితో పాటు నన్ను నమ్మి నాతో వర్క్‌ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నిజ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నేను ఇప్పటివరకు 10 సినిమాల్లో నటించాను ఇది నా 11వ చిత్రం’’ అన్నారు ధనుంజయ్‌.
 

మరిన్ని వార్తలు