హత్యలు చేసిందెవరు?

27 Jul, 2018 02:54 IST|Sakshi
అనురాధ, నందు

‘‘పెద్ద హీరోలు ప్రచారానికి వస్తున్నారు. కానీ, చిన్న హీరోలు ఈ విషయంలో సహకరించడం లేదు. నందు తన సినిమాల ప్రచారంలో పాల్గొనడం లేదు. నిర్మాత తన డబ్బును, దర్శకుడు కెరీర్‌ని పణంగా పెట్టి సినిమా చేస్తారు. అలాంటి దర్శక, నిర్మాతలకు హీరోలు సహకరించాలి’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నందు, అనురాధ జంటగా ఫణిరామ్‌ తుఫాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐందవి’. సన్నీ అండ్‌ విన్నీ సినిమాస్‌ పతాకంపై శ్రీధర్‌ లింగం నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.

ఫణి రామ్‌  మాట్లాడుతూ– ‘‘జనసంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. ఆ హత్యలు చేసిందెవరు? ఈ హత్యలకు, ఐందవికి సంబంధం ఏంటి? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు శ్రీధర్‌లింగం. దిలీప్, అవంతిక, ‘ఛత్రపతి’ శేఖర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఏ ఆర్మాన్, కెమెరా: భరత్‌ సి. కుమార్, సమర్పణ: రాజేశ్వరి తుమ్మల.

మరిన్ని వార్తలు