మహేష్‌ సందడి మొదలవుతోంది

23 Mar, 2018 19:20 IST|Sakshi

సాక్షి, సినిమా : గత రెండు చిత్రాలు తీవ్ర నిరాశ పరచటంతో భరత్‌ అనే నేనుతో ఎలాగైనా హిట్‌ కొట్టి తీరాలన్న కసితో సూపర్‌ ​స్టార్‌ మహేష్‌ బాబు పని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్‌ కమర్షియల్‌ డ్రామా షూటింగ్‌ దాదాపు ఆఖరు దశకు చేరుకుంది. 

ఇక ఈ వైవిధ్యంగా సాగుతున్న ఈ చిత్రం ప్రమోషన్లకు మంచి ఆదరణ లభిస్తుండగా.. ఇప్పుడవి ఓ కొలిక్కి వచ్చాయి. భరత్‌ అనే నేను నుంచి తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు. 

దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్ర పాటలను లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయనున్నారు. కైరా అద్వానీ మహేష్‌కు జోడీగా కనిపించబోతున్న భరత్‌ అనే నేను ఏప్రిల్‌ 20న విడుదల కాబోతున్న విషయం విదితమే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా