తమిళనాడు వెళ్లనున్న ‘భరత్‌’...?

12 May, 2018 10:03 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం మంచి కలెక్షన్సతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక చెన్నైలోను విడుదలై, అక్కడ కూడా మంచి వసూల్లు సాధించింది. దాంతో ఈ చిత్నాన్ని తమిళంలోను అనువాదించాలని చిత్న నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు ప్రారంభమయ్యాయని, అయితే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి చిత్ర యూనిట్‌నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా కైరా అద్వానీ కథానాయకిగా నటించారు.

మరిన్ని వార్తలు