‘కరోనా రాలేదు.. క్వారంటైన్‌కు పంపలేదు’

7 May, 2020 12:52 IST|Sakshi

సాక్షి, చెన్నై: కరోనా సమయంలో సెలబ్రెటీల మీద తప్పుడు వార్తలు రోజు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తూనే ఉన్నాయి. వారు కాస్త ఆస్వస్థతకులోనైనా, ఏ కారణంతోనైనా ఆస్పత్రి దరిదాపుల్లోకి వెళ్లినా వారికి కరోనా అంటగడుతూ సోషల్‌ మీడియాలో వార్తలు రాస్తున్నారు. దీంతో తమకు, తమ కుటుంబసభ్యులెవరికీ కరోనా సోకలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి సెల​బ్రెటీలకు ఏర్పడింది. ఈ క్రమంలో దక్షిణాది దిగ్గజ దర్శకుడు భారతిరాజాలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనను క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారనే వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమన్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు.   

‘భారతిరాజా క్వారంటైన్‌కు తరలించారంటూ వార్తలు వస్తున్నాయి. థానేలో ఉన్న మా సహోదరికి శస్త్ర చికిత్స జరిగింది. ఆమెను చూడటానికి అధికారుల నుంచి పాస్‌ తీసుకునే బయలుదేరాను. థానేకు వెళ్లాక నేనే అధికారులకు చెన్నై నుంచి వచ్చాను అని చెప్పాను. వారు కరోనా టెస్టులు నిర్వహించారు. నెగటీవ్‌ అని వచ్చింది. ఆ తర్వాత మళ్లీ చెన్నైలో టెస్టులు నిర్వహించగా నెగటీవ్‌ అని తేలింది. మొత్తం మూడు చోట్ల నాకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్‌ అని తేలింది.  అన్ని చోట్లా నేనే స్వచ్చందంగా పరీక్షలు చేయించుకున్నా. అయితే పలు జిల్లాలు, రాష్ట్రాలు తిరిగొచ్చానందుకు నాకు నేను నా ఇంట్లో స్వీయ నిర్భంధంలో ఉంటున్నాను. అంతేకాని నన్నెవరూ బలవంతంగా క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించలేదు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. వదంతులు నమ్మకండి. నాపై తప్పుడు వార్తలు రాయకండి’అంటూ భారతీరాజా విజ్ఞప్తి చేశారు.

చదవండి:
కేటీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ప్రకాష్‌ రాజ్‌
విష్ణు టిక్‌టాక్‌ వీడియో.. అద్భుతః

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు