క్రష్‌లు వందల్లో ఉన్నా ఒక్కళ్లూ సెట్టవ్వలే

27 Dec, 2019 17:34 IST|Sakshi

భీష్మ నుంచి తొలి సాంగ్‌ రిలీజ్‌

'సింగిల్స్ యాంథమ్' పేరుతో విడుదలైన గీతం

కుర్రహీరో నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో విడుదలైన టీజర్‌ యూత్‌ను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే. తాజాగా ‘భీష్మ’ నుంచి తొలిపాటను చిత్రబృందం విడుదల చేసింది. 'సింగిల్స్ యాంథమ్' పేరుతో రిలీజైన ఈ గీతానికి అభిమానుల నుంచి ముఖ్యంగా సింగిల్స్‌ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో హీరో సింగిల్ అని చెప్తూనే ‘రెడీ టు మింగిల్‌’ అని సిగ్నల్స్‌ ఇస్తున్నాడు. జంటల్ని చూస్తే జెలసీ అని చెప్తూనే తనూ అమ్మాయిల వెనక పడుతున్నాడు. ఇక ఈ సాంగ్‌ సింగిల్స్‌కు తప్పకుండా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  శ్రీమణి రచించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు. (భీష్మ: ఫస్ట్‌ గ్లింప్స్‌)

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘నితిన్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. భీష్మ ప్రచార చిత్రాలకు ప్రేక్షకాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే విడుదలైన చిత్రంలోని వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. 'భీష్మ' కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతీ అబ్బాయి నితిన్‌ పాత్రకు, ప్రతీ యువతి రష్మిక పాత్రకు కనెక్ట్ అవుతారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది’ అని తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదల కానుంది. చదవండి: ట్రెండింగ్‌లో ‘భీష్మ’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా