బాహుబలి.. వీర యోధ మహాబలి

22 Dec, 2017 00:31 IST|Sakshi

బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ను, రికార్డులను ‘బాహుబలి’ ఏ లెవెల్లో కొల్లగొట్టిందో సినీ లోకమంతా చూసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తొలుత రిలీజ్‌ చేసిన ఈ సినిమాను కొన్ని భాషల్లోకి డబ్‌ చేశారు. డబ్బింగ్‌ వెర్షన్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టోటల్‌గా మన టాలీవుడ్‌ సత్తా ఏంటో ‘బాహుబలి’ వరల్డ్‌ వైడ్‌గా చాటింది. ఈ నెల 29న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని అనువదించి, విడుదల చేస్తున్నారు కానీ, వేరే భాషలవాళ్లు రీమేక్‌ చేసే సాహసం అయితే చేయలేదు.

మరి.. ఐదేళ్లంటే మాటలా? పైగా మరో రాజమౌళి ఉండాలి కదా? ప్రభాస్, రానా, రమ్యకృష్ణ.. ఇలా ఏ ఆర్టిస్ట్‌ని తీసుకున్నా వేరే భాషల్లో ఇలాంటి ‘గుడ్‌ ప్యాకేజ్‌’ సెట్‌ అవుతుందా? అంటే.. భోజ్‌పురి వాళ్లు సెట్‌ చేసుకున్నారని సమాచారం. యస్‌.. ‘బాహుబలి’ చిత్రం భోజ్‌పురిలో రీమేక్‌ అవుతోందని టాక్‌. అందుకు తగ్గట్టే.. కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. సో.. నమ్మక తప్పదు. దినేష్‌ లాల్‌ యాదవ్‌ నిర్హూస్‌ హీరోగా దర్శకుడు ఇక్బాల్‌ భ„Š  ‘వీర్‌ యోధ మహాబలి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది  ‘బాహుబలి’కి రీమేక్‌ అనేది భోగట్టా.

‘‘షూటింగ్‌ ఆఫ్‌ మై డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ వీర్‌ యోధ మహాబలి’’ అంటూ నిర్హూస్‌ ఫేస్‌బుక్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. అవి అచ్చం... ‘బాహుబలి’లో మన ప్రభాస్‌ గెటప్‌ పోలినట్లే ఉన్నాయి. అయితే... ఇది ‘బాహుబలి’కి రీమేక్‌ అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇక, ఈ చిత్రకథానాయకుడు విషయానికొస్తే.. దినేష్‌లాల్‌ యాదవ్‌ భోజ్‌పురి ఇండస్ట్రీలో సింగర్, తర్వాత యాక్టర్‌గా మారాడు. టెలివిజన్‌ ప్రజెంటర్‌గా కూడా వర్క్‌ చేశాడు. 2012 బిగ్‌ బాస్‌ 6 కంటెస్ట్‌ కూడా. ప్రజెంట్‌ టాప్‌ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ‘నిర్హాహ్‌ హిందూస్థానీ, పాట్నానే పాకిస్తాన్‌’ వంటి భోజ్‌పురి చిత్రాల్లో నటించారు. వాటిని హిందీలోనూ విడుదల చేశారు. ఈ సంగతలా ఉంచితే.. మన ‘బాహుబలి’ సాధించిన తాజా రికార్డ్‌ గురించి చెప్పుకుందాం.

 ఐఎమ్‌డిబీ(ఇంటర్‌నెట్‌ మూవీ డేటాబేస్‌) ఈ ఏడాది ఇండియన్‌ టాప్‌ 10 మూవీస్‌ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో ‘బాహుబలి 2’ సినిమా సెంకడ్‌ ప్లేస్‌లో నిలిచింది. ఫస్ట్‌ ప్లేస్‌ను మాధవన్, విజయ్‌ సేతుపతి నటించిన ‘విక్రమ్‌ వేద’ ఆక్రమించడం విశేషం. అర్జున్‌రెడ్డి, సీక్రెట్‌ సూపర్‌స్టార్, హిందీ మీడియమ్, ఘాజి సినిమాలు 3,4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. తొలి టాప్‌ 10 మూవీస్‌ లిస్ట్‌లో ఐదు సినిమాలు ఉండటం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు