బసంతి కళాశాలలో ఏం జరిగింది?

19 Jan, 2014 00:13 IST|Sakshi
బసంతి కళాశాలలో ఏం జరిగింది?
 ‘షోలే’ సినిమాలో హీరోయిన్ హేమమాలిని పాత్ర పేరు ‘బసంతి’. ఆ సినిమా గుర్తున్నంత కాలం... ఈ బసంతి కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడీ ‘బసంతి’ టైటిల్‌తో దర్శకుడు చైతన్య దంతులూరి ఓ సినిమా చేస్తున్నారు. అయితే బసంతి అనేది ఇందులో హీరోయిన్ పేరు కాదట. ఓ కళాశాల పేరట. ఈ కాలేజీ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను మిళితం చేసి ఈ కథను అల్లుకున్నారట. ఆ కళాశాలలో ఏం జరిగిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమట. 
 
 పసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్  ఇందులో విద్యార్థిగా హీరోచిత పాత్ర చేస్తున్నారు. అలీషా బేగ్ నాయిక. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఈ నెల 25న పాటలను విడుదల చేయబోతున్నారు. సహనిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. కృష్ణ చైతన్య, శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా