కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

17 Jul, 2019 16:03 IST|Sakshi


ముంబై : ఈద్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ మూవీ ఫుల్‌రన్‌లో కనీసం రూ 200 కోట్ల వసూళ్లను అధిగమించలేకపోయింది. రూ 100 కోట్ల క్లబ్‌ను అందుకోలేని అజయ్‌ దేవ్‌గన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ల దీదీప్యార్‌దే తరహాలో భారత్‌ ప్రతిష్టాత్మక రూ 200 కోట్ల క్లబ్‌కు కేవలం రూ 3 కోట్ల దూరంలో నిలిచింది. ఫుల్‌రన్‌లో కండలవీరుడి భారత్‌ మూవీ రూ 197 కోట్లు రాబట్టిందని బాక్సాఫీస్‌ ఇండియా రిపోర్ట్‌ పేర్కొంది.

ఈ ఏడాది అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టే చిత్రంగా భారత్‌పై భారీ అంచనాలుండగా ఈ మూవీ కేవలం కనీసం రూ 200 కోట్ల మార్క్‌ను అధిగమించలేకపోవడం ఆశ్చర్యమేనని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ వంటి స్టార్‌లతో పాటు మంచి టాక్‌ను అందుకున్నప్పటికీ భారత్‌ వసూళ్ల సునామీని షాహిద్‌ కపూర్‌-కియారా అద్వానీల కబీర్‌ సింగ్‌ నిలువరించింది. తెలుగు మూవీ అర్జున్‌ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్‌ సింగ్‌ బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు