బాలీవుడ్‌ భాగమతి

19 Oct, 2019 02:31 IST|Sakshi
భూమి పెడ్నేకర్‌

గత ఏడాది ‘భాగమతి’గా అనుష్క ప్రేక్షకులను భయపెట్టి, మంచి బాక్సాఫీస్‌ వసూళ్లు సాధించారు. అనుష్క లేడీ ఓరియంటెడ్‌ సినిమాల హిట్‌ లిస్ట్‌లోకి ‘భాగమతి’ కూడా చేరింది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్‌ కాబోతోందని తెలిసింది. ఈ చిత్రం రీమేక్‌ హక్కులను విక్రమ్‌ మల్హోత్రా తీసుకున్నారు. ఇందులో అనుష్క పోషించిన పాత్రను  భూమి పెడ్నేకర్‌ చేస్తారని సమాచారం. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన జి.అశోక్‌ ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నట్టు బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం భూమి పెడ్నేకర్‌ ‘సాంద్‌ కీ ఆంఖ్, బాలా’ సినిమాల రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ‘సాంద్‌ కీ ఆంఖ్‌’లో 90ఏళ్ల గన్‌ షూటర్‌గా నటించారామె.

మరిన్ని వార్తలు