35వ వసంతంలోకి భూమిక చావ్లా

21 Aug, 2013 14:35 IST|Sakshi
35వ వసంతంలోకి భూమిక చావ్లా
టాలీవుడ్ హీరో సుమంత్ సరసన యువకుడు చిత్రం ద్వారా 2000 సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన భూమిక చావ్లా గురువారం ఆగస్టు 21 తేదిన 35వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. భూమిక చావ్లా అసలు పేరు రచన చావ్లా. 
 
కొద్దికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ, భోజ్ పూరి, మలయాళ, పంజాబీ చిత్రాల్లో 30కి పైగా చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో ఖుషీ, సల్మాన్ ఖాన్ తో తేరేనామ్, అభిషేక్ బచ్చన్ తో రన్, మహేశ్ బాబుతో ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి, రవితేజతో నా ఆటోగ్రాఫ్, చిరంజీవితో జై చిరంజీవ, మిస్సమ్మ,  గాంధీ మై ఫాదర్, సత్యభామ, అనసూయ తదితర చిత్రాల్లో భూమిక నటన విమర్శల ప్రశంసలందుకుంది. 
 
కెరీర్ గ్రాఫ్ టాప్ రేంజ్ లో సాగుతుండగానే యోగ గురువు భరత్ ఠాకూర్ ను 21 అక్టోబర్ 2007 సంవత్సరంలో నాసిక్ లోని దేవ్లాలీలోని ఓ గురుద్వారాలో పెళ్లాడింది. ఆ తర్వాత తకిట తకిట చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. తమిళ చిత్రం కలవాడియా పోజుదుగల్ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,  తెలుగులో అలివేలు మంగ, ఏప్రిల్ ఫూల్, మలయాళంలో రాత్రిమజా, తమిళంలో చితిరాయిల్ నీల సొరూ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.