ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మెగాస్టార్‌

21 Jun, 2019 14:55 IST|Sakshi

సాక్షి,ముంబై:  బాలీవుడ్‌  మోగా స్టార్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ (76) మరోసారి తన ఫ్యాన్స్‌ను  ఆశ్చర్యంలో ముంచెత్తారు.  లేటు వయసులో కూడా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న  అమితాబ్  రాబోయే చిత్రం "గులాబో సితాబో"  ఫస్ట్‌లుక్‌  విడుదలైంది. పొడవాటి గడ్డం, కళ్ళజోడు,   వెరైటి  తలపాగా,  ప్రొస్థెటిక్ ముక్కుతో ఓల్డ్ మాన్ లుక్‌లో గుర్తుపట్టలేనంతగా బిగ్ బి ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చారు.

ఆయుష్మాన్ హీరోగా సుజీత్ సిర్కార్ తెరకెక్కిస్తునన్న  గులాబో సితాబొ అనే చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర  పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. అందులో అమితాబ్‌కు చెందిన  ఫస్ట్‌లుక్‌ను  ప్రముఖ విమర్శకుడు తరన్‌ ఆదర్శ్‌ ట్విటర్లో షేర్‌ చేశారు.  పికూ రచయిత  జుహీ చతుర్వేది  కథను సమకూర్చగా.. లక్నో పరిసర ప్రాంతాలల్లో షూటింగ్‌ జరపుకుంటోంది. ఇదివరకెన్నడూ నటించని పాత్రలో విలక్షణంగా అమితాబ్ ఈ మూవీలో అలరించనున్నారట.  ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు