బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

20 Jul, 2019 11:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారం కానున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్‌ లిస్టు ఖరారైనట్లు సమాచారం. వంద రోజుల పాటు సాగనున్న ఈ షోలో హౌజ్‌లో ఉండబోతున్న సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో న్యూస్‌ యాంకర్‌ తీన్‌మార్‌ సావిత్రి, జర్నలిస్టు జాఫర్‌, యాంకర్‌ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్‌ సందేశ్‌, అతడి భార్య వితికా షేరు, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్‌స్మాష్‌ స్టార్‌), రఘు మాస్టర్‌‌, ఫన్‌ బకెట్‌ మహేష్‌ విట్టా, తమన్నా సింహాద్రిలు పాల్గొననున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే కంటెస్టెంట్ల విషయంలో స్పష్టత రానుంది.

కాగా ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో ఆది నుంచి వివాదాస్పదం అవుతోంది. షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలు షోను నిలిపి వేయలంటూ ధర్నా చేస్తుండగా.. బిగ్‌బాస్‌ ప్రసారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు