బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

17 Sep, 2019 22:58 IST|Sakshi

తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ రెండోరోజు కొనసాగింది. హిమజ సేవ్‌ అవ్వడానికి వరుణ్‌సందేశ్‌ పేడతో నింపిన టబ్బులో పడుకోవడంతో హిమజ సేవ్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. తర్వాత రవిని టెలిఫోన్‌ బూత్‌కు పిలిపించాడు. రవి నామినేషన్‌ నుంచి సేవ్‌ అవ్వడానికి శివజ్యోతి తన జుట్టును కత్తిరించుకోవాలని(నెక్‌ వరకు) బిగ్‌బాస్‌ ఆదేశించాడు. బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో తనీష్‌ కోసం ఇదే తరహాలో దీప్తి సునయన జుట్టును కత్తిరించుకొంది. శివజ్యోతి తన జుట్టును నెక్‌హెడ్‌ వరకు కత్తిరించికోవడంతో రవి సేవ్‌ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు‌.

రాహుల్‌ నామినేషన్‌ నుంచి సేవ్‌ అవ్వడానికి పునర్ణవి ఈ సీజన్‌ మొత్తం నేరుగా సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకోవాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. పునర్నవి ఒప్పుకున్న రాహుల్‌ అందుకు ఒప్పుకొకపోవడం,  పునర్ణవి సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకోవడం లేదని రాహుల్‌ ఈ వారం నేరుగా నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ తెలిపారు. ఇంతటితో నామినేషన్‌ ప్రక్రియ ముగిసినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. కెప్టెన్సీ అధికారం ఉపయోగించి ఒకరిని నేరుగా నామినేట్‌ చేయాలని ఈ వారం హౌస్‌ కెప్టెన్‌ అయిన వితికాను బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ఈ వారం హిమజను నేరుగా నామినేట్‌ చేస్తున్నట్లు వితికా తెలిపింది. ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లడానికి నామినేట్‌ అయిన సభ్యుల్లో మహేశ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజలు ఉన్నారు.

ఈ వారం టాస్క్‌లో భాగంగా క్రేజీ కాలేజ్‌ అనే టాస్క్‌ను ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ తెలిపాడు. ఈ టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్ లవ్వాలజీ, వితికా గాసిఫాలజీ, వరుణ్‌ సందేశ్‌లు చిల్లాలజీ టీచర్లుగా, ఇంటిలోని మిగతా ఇంటి సభ్యులందరూ స్టూడెంట్స్‌గా వ్యవహరిస్తారు. టాస్క్‌లో భాగంగా ప్రేమకు సంబంధించి స్టూడెంట్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు లవ్వాలజి టీచర్‌ బాబా భాస్కర్‌ సమాధానాలు చెప్పారు. రాహుల్‌కు ఒక లవ్‌ సాంగ్‌ పాడమని బాబా బాస్కర్‌ అడగడంతో ప్రియురాలు పిలిచింది సినిమాలోని పాట పాడి ఇంటిసభ్యులను ఉత్సాహపరిచారు. గాసిఫాలజీ టీచర్‌గా వితికా గాసిఫ్‌లు ఎలా పుడతాయి, ఎలా ఉంటాయో స్టూడెంట్స్‌కు తెలిపారు. చిల్లాలజి టీచర్‌గా వచ్చిన వరుణ్‌ సందేశ్‌ తీవ్రమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారో చెప్పమని ఇంటిసభ్యులను అడిగారు. అందుకు చిల్డ్‌ బీర్‌ను తాగుతూ ఎంత కఠిన పరిస్థితులైనా ఎదుర్కొంటామని చెప్పాడు. ఈ క్రేజీ కాలేజ్‌ టాస్క్‌ మొదట సరదాగానే సాగినా చివర్లో శివజ్యోతి కంటతడితో నేటి ఎపిసోడ్‌ ముగిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా