బిగ్‌బాస్‌: ఇలాంటి వాడిని విజేతగా ప్రకటిస్తారా?

15 Feb, 2020 17:42 IST|Sakshi
బాలికా వధు ఫేం సిద్దార్థ్‌ శుక్లా(ఫైల్‌ ఫొటో)

హిందీ బిగ్‌బాస్‌ షోపై సంచలన ఆరోపణలు

ఇది రియాలిటీ షో ఎలా అవుతుంది

అందుకే జాబ్‌ వదిలేస్తున్నా

బిగ్‌బాస్‌ షో క్రియేటివ్‌ టీం మెంబర్‌ ట్వీట్లు

ముంబై: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 తుది అంకానికి చేరుకుంది. ప్రముఖ హిందీ చానెల్‌లో ప్రసారమతున్న ఈ రియాలిటీ షో.. పదమూడో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఫైనలిస్టులు బాలికా వధు ఫేం సిద్దార్థ్‌ శుక్లా, నటుడు అసీం రియాజ్‌లలో ట్రోఫీని ముద్దాడేది ఎవరన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ 13షో క్రియేటివ్‌ టీంలో సభ్యురాలైన ఫెరీహా అనే టెక్నీషియన్‌ షో సాగుతున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసీం కంటే తక్కువ ఓట్లు పడినప్పటికీ సిద్దార్థ్‌నే విన్నర్‌గా ప్రకటించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారని వరుస ట్వీట్లు చేశారు. విజేతగా నిలిచేందుకు అసీంకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. సిద్దార్థ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని.. ఇదొక ఫిక్స్‌డ్‌ షో అని విమర్శలు గుప్పించారు. ఈ కారణంగా సదరు చానెల్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు పేర్కొన్నారు.(బిగ్‌బాస్‌: చెప్పుతో కొట్టింది..)


అసీం రియాజ్‌

ఈ మేరకు... ‘‘నా జాబ్‌ వదిలేయాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి టీంలో నేను కొనసాగలేను. మెడికల్‌ చెకప్‌ కోసమంటూ సిద్దార్థ్‌ పలువురు టెక్నీషియన్లతో, పీఆర్‌తో భేటీ అయ్యాడు. అప్పుడు అతడికి సెల్‌ఫోన్‌ కూడా ఇచ్చారు. నిర్వాహకులు తనకు అనుకూలంగా వ్యవహరించారు. అలాంటప్పుడు ఇది రియాలిటీ షో ఎలా అవుతుంది? అంతర్జాతీయ ప్రముఖుల నుంచి అసీంకు వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక.. సిద్ధార్థ్‌ గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు’’ అని ఫెరీహా ట్విటర్‌లో సంచలన ఆరోపణలు చేశారు.(అత్యాచారానికి ప్రయత్నించాడు)

అదే విధంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన సిద్ధార్థ్‌ శుక్లాను విజేతగా ప్రకటించి.. సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని షో నిర్వాహకులను ప్రశ్నించారు. ‘‘ షో ఆసాంతం సిద్ధార్థ్‌  శుక్లా మహిళలను అవమానించాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. హింసకు పాల్పడ్డాడు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. ఇలాంటి వాడిని విజేతగా ప్రకటిస్తారా? ఇది నిజంగా చాలా దురదృష్టకరం’’ అని ఫెరీహా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రేషమీ దేశాయ్‌, సిద్దార్థ్‌ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్‌ గిల్‌, పారస్‌ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్‌ కౌర్‌, సిద్దార్థ్‌ డే, ఆర్తీ సింగ్‌, అసీం రియాజ్‌, అబూ మాలిక్‌, షఫాలీ బగ్గా, మహీరా శర్మ వంటి సినీ సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టగా.. సిద్ధార్థ్‌, అసీం ఫైనల్‌కు చేరుకున్నారు.(బిగ్‌బాస్‌: ‘నువ్వు లేకుండా నేనుండలేను’)

మరిన్ని వార్తలు