బిగ్‌బాస్‌: బాత్రూం కడిగిన సల్మాన్‌ ఖాన్‌

29 Dec, 2019 13:46 IST|Sakshi

బిగ్‌బాస్‌ 13 హిందీ సీజన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్‌ ఖాన్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొందనుకునేరు.. అదేం లేదు, బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌పై సల్లూ భాయ్‌ గుర్రుగా ఉన్నాడు. వాళ్లు ఇంటిని శుభ్రంగా ఉంచుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగాడు. సల్మాన్‌ ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి హౌస్‌మేట్స్‌ అందరూ బెడ్‌రూంలో ఉండగా తలుపులు మూసుకుపోయాయి.

దీంతో వాళ్లకు కాసేపటివరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇక సల్మాన్‌ వచ్చీరాగానే నేరుగా సింక్‌ దగ్గరకు వెళ్లి హౌస్‌మేట్స్‌ తిని వదిలేసిన గిన్నెలను కడిగాడు. ఆ తర్వాత స్టౌ దగ్గర పేరుకుపోయిన జిడ్డును తొలగించి కిచెన్‌ను క్లీన్‌ చేశాడు. అనంతరం బాత్రూం శుభ్రం చేశాడు. ఇదంతా చూసిన హౌస్‌మేట్స్‌ సిగ్గుతో తలదించుకుని సల్మాన్‌కు సారీ చెప్పారు. అయితే సల్మాన్‌ మాత్రం వారిని క్షమించినట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tomorrow's precap. Follow for more.Turn on notification . . . . .#biggboss13 #biggboss13updates #virima #bb10 #madhurimatuli #biggboss #bb13 #bb12 #sana #shehnazgill #sidharthshukla #devolinabhatacharya #debo #asimriaz #artisingh #arshikhan #vikasgupta #vishaladityasingh #paraschhabra #himanshikhurana #hindustanibhau #hinakhan #salmankhan #mahirasharma #mtv #rashmidesai #manveergurjar #daljitkaur

A post shared by Bigg Boss13 (@biggboss14official_) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా