బిగ్‌బాస్‌ 2.. ఇంకొంచెం మసాలా కన్ఫామ్‌!

18 May, 2018 19:31 IST|Sakshi

బిగ్‌బాస్‌ 2 హోస్ట్‌గా నేచురల్‌ స్టార్‌

తెలుగు బిగ్‌బాస్‌ సెలబ్రిటీ షో రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా నేచురల్‌ స్టార్‌ నాని వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారింగా ఓ పోస్టర్‌తో కన్ఫామ్‌ చేశారు నాని. బిగ్‌బాస్‌ 2లోగోతో పాటు నాని లుక్‌ను ఇందులో చూడవచ్చు. ‘బాబాయ్‌.. ఈసారి ఇంకొంచం మసాలా.. బిగ్‌బాస్‌తెలుగు2’ అని నాని ట్వీట్‌ చేయగా వైరల్‌ అవుతోంది. నాని ట్వీట్‌పై స్టార్‌ మా స్పందిస్తూ.. ‘స్టార్‌ మా నానికి ఆహ్వానం పలుకుతోంది. వ్యాఖ్యాతగా నాని సక్సెస్‌ అవ్వాలని అకాంక్షిస్తూ’ నాని ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది.

తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్‌చేస్తున్నారు నిర్వాహకులు. ఫస్ట్‌ సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసి సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే. తొలి సీజన్‌ 70 రోజులు నిర్వహించగా, బిగ్‌బాస్‌-2 100 రోజులపాటు జరగనుంది. జూన్‌ 10 నుంచి రెండో సీజన్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించనున్నారు. ఎన్టీఆర్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవటంతో రెండో సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా చేయనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా