బిగ్‌బాస్‌ : నెటిజన్లపై మండిపడ్డ నాని

22 Jul, 2018 23:30 IST|Sakshi

ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారన్న విషయం ముందే లీకైంది. శనివారం జరిగిన షూటింగ్‌లోంచి వచ్చే లీకులు, బయటకు వచ్చిన తరువాత సోషల్‌ మీడియాలో వారు పోస్ట్‌ చేసే ఫోటోల ద్వారా ఎవరు ఎలిమినేట్‌ అయ్యారో ఈజీగా తెలిసిపోతోంది. బిగ్‌బాస్‌ ఇంత కష్టపడి సస్పెన్స్‌ మెయింటెన్‌ చేయాలని చూస్తోన్నా.. ఈ లీకులు మాత్రం ఆగడం లేదు. ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్‌ కాబోతోందన్న వార్త ముందే బయటకు వచ్చింది. 

సందడి చేసిన మంచు లక్ష్మి..
ప్రతివారం ఎలిమినేషన్‌ ప్రకటించే నాని.. ఈసారి మాత్రం ఆ బాధ్యతను మంచు లక్ష్మికి ఇచ్చారు. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇంట్లోకి ఎంటరైన మంచు లక్ష్మి.. హౌజ్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. ఇంటిలో హంగామా చేస్తున్న మంచు లక్ష్మికి టాస్క్‌ ఇచ్చారు. నాని బిగ్‌బాస్‌ ఇంట్లోని సభ్యుల మాదిరిగా ఇమిటేట్ చేస్తూ ఉంటే.. తను గుర్తు పడుతూ ఉండాలి. ఈ టాస్క్‌లో మంచి లక్ష్మి దాదాపుగా అందరిని గుర్తుపట్టారు. రోల్‌రైడా తనకోసం ఓ పాటను ఆలపించాడు. గణేష్‌ కూడా ఆర్జేగా మారి అక్కడి వాతావరణాన్ని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. చివరగా మంచు లక్ష్మి.. ఆరో వారం ఎలిమినేషన్‌ కానున్న కంటెస్టెంట్‌ తేజస్వీ అని ప్రకటించారు. 

నెటిజన్లపై మండిపడ్డ నాని
బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులపై సోషల్‌ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌పై నాని మండిపడ్డారు.‘మీకు ఒకరు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు.. హౌజ్‌లో ఓ సభ్యుడు ఉండొచ్చు.. ఉండకూడదు.. బాబోయ్‌ ఈ హౌజ్‌మేట్‌ మాకొద్దు అని చెప్పొచ్చు. కానీ అసభ్యకరమైన పదాలతో కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా తేజస్వీ విషయంలో ఇలాంటి కామెంట్స్‌ వస్తున్నాయి. ఏంటి ఇలాంటి మనుషులు బయట ఉన్నారా అని అనిపిస్తోంది’ అంటూ సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్‌, జుగుప్సాకరమైన పదాలతో కామెంట్స్‌ చేసే వారిపై నాని మండిపడ్డారు.

గణేష్‌ పై బిగ్‌బాంబ్‌.. 
ఇంటి నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి నాని ఓ టాస్క్‌ ఇచ్చారు. ఇంటి సభ్యులందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పి మార్కులు వేయాలని చెప్పారు. ఈ టాస్క్‌లో సామ్రాట్‌, తనీష్‌, బాబు గోగినేనికి పదికి పది మార్కులివ్వగా.. కొందరికి 8 మార్కులు ఇచ్చింది. కౌశల్‌కు 5 మార్కులు ఇచ్చి.. కౌషల్‌ తనకు బయట కూడా తెలుసని, తను ఎలాంటి వాడో తెలుసంటూ.. కౌశల్‌ విషయంలో తనెప్పుడూ తప్పు కాదు అంటూ వివరించింది. అమిత్‌ను దొంగ మై కొడుకు.. గణేష్‌ను లడ్డేశ్‌, బ్రెడ్డేష్‌, హౌలేష్‌ .. దీప్తి సునయను అలక రాణి.. తనీష్‌ కోపంలోనే బాగుంటాడు.. అని తెలిపింది. ఈ వారం బిగ్‌ బాంబ్‌ను కాస్త వెరైటీగా ప్లాన్‌ చేశారు. ముందు ఒక ఇంటి సభ్యుడిని ఎంచుకున్న తరువాత బిగ్‌బాంబ్‌ ఏంటి అనేది రివీల్‌ చేశారు. తేజస్వీ గణేష్‌ను ఎంచుకోగా.. తరువాతి వారం మొత్తం  పాలసీసాతో నీటిని తాగడమే ఈవారం బిగ్‌బాంబ్‌ అంటూ నాని తెలిపారు. తేజస్వీ వెళ్తూ వెళ్తూ... కౌశల్‌ నువ్వు గేమ్‌లో విన్నర్‌ అవుతామో కానీ నేను హౌజ్‌మేట్స్‌ అందరి మనసు గెలుచుకున్నాను అంటూ పేర్కొంది.

చదవండి : బిగ్‌బాస్‌: తేజస్వీ ఔట్‌ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు