బిగ్‌బాస్‌.. 65 రోజుల అప్‌డేట్స్‌

24 Sep, 2019 22:14 IST|Sakshi

బిగ్‌బాస్‌.. బిగ్‌బాస్‌.. ఎక్కడ చూసినా అదే మాట.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌. ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతైన ఈ షో.. తెలుగునాట సంచలనంగా మారింది. ప్రస్తుతం మూడో సీజన్‌ అప్రతిహతంగా దూసుకుపోతోంది. మొదటి సీజన్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నిలబెట్టగా.. నాని రెండో సీజన్‌ భుజాలపై మోశాడు. ఇక మూడో సీజన్‌ను టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్‌ నాగార్జున తన హోస్టింగ్‌తో.. షోను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే పది తొమ్మిది వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని.. పదోవారంలోకి ఎంటర్‌ అయింది.

ఇప్పటివరకు గడిచిన తొమ్మిది వారాల్లో ఎనిమిది ఎలిమినేషన్లు జరగ్గా.. అందులో ఇద్దరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు వచ్చినట్టే వచ్చి వెనుదిరిగి పోయారు. హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూ, అలీరెజా, శిల్పా చక్రవర్తి, హిమజ ఎలిమినేట్‌ అయ్యారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తిలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అవన్నీ ఆవిరైపోయాయి. 

అలకలు, అరుపులు, గొడవలు, ప్రేమలు, ద్వేషాలు ఇలా అన్నింటిని చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్లను ఓ ఆట ఆడిస్తున్నాడు. గ్రూపులు మారుతున్నాయి.. వ్యూహాలు మారుతున్నాయి.. ఎవరు ఎవరికి దగ్గరవుతున్నారు.. ఎవరికి దూరమవుతున్నారు.. అప్పటికీ ఇప్పటికీ హౌస్‌లో ఉన్న పరిస్థితులు ఏంటి? బిగ్‌బాస్‌ అప్‌డేట్స్‌ కోసం సాక్షి వెబ్‌సైట్‌ని చూడండి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు