బిగ్‌బాస్‌.. రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా?

26 Aug, 2019 17:46 IST|Sakshi

ఎప్పుడూ వాడివేడిగా జరిగే బిగ్‌బాస్‌ ఎలిమినేషన్స్‌ నిన్నటి ఆదివారం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. శివజ్యోతి తప్ప మిగతా అందరూ నవ్వుతూనే అషూను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇక వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉండాల్సిన అర్హత ఇంటి సభ్యుల్లో ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేది తేల్చేసి చెప్పింది. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది. మరి అషూ చెప్పిన సూచనలు పాటిస్తూ.. వారి తప్పులను సరిదిద్దుకుంటారో, లేదా అన్నది పక్కన పెడితే తను చెప్పిన పేర్లే నామినేషన్‌లో ఉండనున్నాయా అన్నది చూడాలి. మరోవైపేమో ఏ తప్పూ చేయకపోయినా నామినేషన్స్‌లోకి వెళ్లిన రోహిణి ఉత్తిపుణ్యానికే ఎలిమినేట్‌ అయింది. తను వెళ్లిపోయిన తర్వాత వారమే అషూ కూడా ఇంటి నుంచి వీడ్కోలు తీసుకుంది. నేటి ఎపిసోడ్‌లో ఆరో వారానికి గానూ నామినేషన్‌ ప్రక్రియ జరగబోతోంది.

ఇక ఇంట్లో గడిచిన వారంలో కొత్త గొడవలు జరిగాయి. దీంతో ఇంటి సభ్యులు వారిని పాయింట్‌ అవుట్‌ చేస్తారా? అనేది చూడాలి. మరోపక్క స్నేహగీతం పాడుకునే కంటెస్టెంట్లు కూడా వారి స్నేహితులపైనే నామినేషన్‌ అనే బాణాన్ని ఎక్కు పెట్టినట్టుగా తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక వారిద్దరూ తనకు రెండు కళ్లు అని చెప్పిన బాబా ఎవరిని నామినేట్‌ చేశాడు? హిమజ చెప్పినట్టుగా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్న ఆ వ్యక్తి ఎవరు? డెఫినెట్‌లీ ఒక స్టెప్‌ ముందున్నాడు కాబట్టి అంటూ శ్రీముఖి ఎవరిని నామినేట్‌ చేసింది? ఇక తనని గతంలో నామినేట్‌ చేసిన వారిపై రాహుల్‌ ప్రతీకారం తీర్చుకోనున్నాడా! బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. మరి ఈ జాబితాలో కొత్తగా ఎవరు చేరనున్నారు? అందుకు ఎవరు నామినేట్ కానున్నారనే విషయాలు నేటి ఎపిసోడ్‌లో తేలనున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు! 

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు