అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

8 Sep, 2019 22:10 IST|Sakshi

శనివారం సాయంత్రం నుంచే బిగ్‌బాస్‌ ఏడో వారంలో ఇంటిని వీడే కంటెస్టెంట్‌ అలీరెజా అంటూ ప్రచారం సాగింది. అయితే తీరా చూస్తే అదే నిజమైంది. అలీరెజా ఎలిమినేట్‌ అయినట్టు నాగ్‌ చెప్పడంతో హౌస్‌మేట్స్‌ అందరూ షాక్‌కు గురయ్యారు. ఇక శివజ్యోతి పాతాళగంగలా మారిపోయింది. శివజ్యోతి వెక్కి వెక్కి ఏడుస్తూ అలీని వీడలేకపోయింది. శ్రీముఖి కూడా కన్నీరు పెట్టుకుంది. తాను వెళ్తుంటే.. ఇంత మంది ఏడుస్తున్నారు.. ఇది చాలు.. టైటిల్‌ గెలవకపోయినా పర్లేదు అంటూ అలీ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి అలీకి వీడ్కోలు చెప్పారు.

బయటకు వచ్చిన అలీ.. హౌస్‌మేట్స్‌తో ఫోన్‌లో పర్సనల్‌గా మాట్లాడేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. స్ట్రాంగ్‌గా ఉండంటూ, ఏడ్వొద్దని శివజ్యోతికి సూచించాడు. ఎలా ఆడుతున్నావో అలానే ఆడు, బాబా భాస్కర్‌ను చూస్తూ ఉండంటూ మహేష్‌కు సలహా ఇచ్చాడు. మంచోడు మంచోడు అంటే సరిపోదు.. గేమ్‌ కూడా ఆడు.. జ్యోతిని సరిగా చూసుకో అంటూ రవికి, అమేజింగ్‌, ఎలా ఆడుతున్నావో అలానే ఆడు.. ఫైనల్‌ వరకు ఉంటావని వరుణ్‌కు సూచించాడు. పునర్నవి-అలీ పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. కొంచెం చూస్తూ మాట్లాడు అంటూ రాహుల్‌కు, జ్యోతిని కూడా కాస్త చూస్తూ ఉండు అని వితికాను కోరాడు. విన్నర్‌గా చూడాలనుకుంటున్నా అని శ్రీముఖికి తెలిపాడు. 

నాగార్జునతో పాటు నాని కూడా బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సందడి చేశారు. గ్యాంగ్‌ లీడర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాని హౌస్‌మేట్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడానికి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో నాని రైటర్‌ కాబట్టి.. హౌస్‌మేట్స్‌కు సరిపోయే క్యారెక్టర్స్‌ను సూచించాడు. హౌస్‌మేట్స్‌కు గ్యాంగ్‌ లీడర్‌ ట్రైలర్‌ ప్లే చేసి చూపించారు. నాగ్‌ ఇచ్చిన కొన్ని ఇంగ్లీష్‌ మూవీ టైటిల్స్‌ను తెలుగులో అనువాదం చేసి ఫన్‌ క్రియేట్‌ అయ్యేలా చేశాడు. ఇక ఎనిమిదో వారంలో ఎంటర్‌ కానున్న బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు