బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

26 Oct, 2019 15:12 IST|Sakshi

తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్‌3 షో ముగింపు దశకు వచ్చింది. ఫైనల్‌కి వెళ్లే టాప్ 5 ప్లేస్‌ల కోసం హౌస్‌మేట్స్‌ పోటీ పడుతున్నారు. రాహుల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనల్ పోరులో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో బాబా మాస్టర్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. అనూహ్యంగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 

శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలోని మంచి జోష్ ఉన్న సాంగ్‌తో నిన్నటి ఎపిసోడ్‌ ప్రారంభమైంది. ఈ పాటకు శ్రీముఖి, బాబా భాస్కర్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. వీరికి శివజ్యోతి కూడా జతకలవడంతో డాన్స్‌లతో హౌస్‌ను షేక్ చేశారు. అనంతరం టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్‌కి కేఎల్‌ఎం ఫ్యాషన్స్ వాళ్లు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి, మిస్టర్ అండ్ మిస్ బిగ్ బాస్ హౌస్‌‌గా నిలిచిన వాళ్లకు వారికి 10వేల గిఫ్ట్ ఓచర్ ప్రకటించారు బిగ్ బాస్. ఈ గిఫ్ట్‌ ఓచర్‌ను బాబా భాస్కర్‌, శివజ్యోతి దక్కించుకున్నారు.]

(చదవండి: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!)

అనంతరం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ చుక్కలు చూపించాడు. అర్థరాత్రి వేళ సైరన్‌ మోగించి.. నామినేషన్‌లో ఉన్నవారిని బ్యాగులు సర్ధుకొని గార్డెన్‌ ఏరియాలోకి రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో షాకైన ఇంటిసభ్యులు.. నిద్రమత్తులోనుంచి తేరుకొని బ్యాగులు సర్ధుకున్నారు. శని, ఆదివారాల్లో నామినేషన్‌ ఉంటే ఇప్పుడు బ్యాగులు సర్ధుకోవాడం ఏంటని అనుకుంటూ.. భారంగా బ్యాగ్‌లు తీసుకొని గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ పై బాబా మాస్టర్‌ తనదైన స్టేల్లో జోకులు పేల్చాడు.ఎందుకు ఇప్పుడు బ్యాగ్‌లు సర్ధమంటున్నారని వరుణ్ అడిగితే బయటకు పిలిచి ఆటోకి డబ్బులు ఇస్తారంట అన్నాడు. మరి మీకేం కావాలి అని వరుణ్‌ అడగ్గా..  ఫ్లైట్ టికెట్‌తో పాటు ఓ పది లక్షలు ఇస్తే హ్యాపీగా బయటకు వెళిపోతా అన్నాడు. మరి ఓ బిర్యానీ ప్యాకెట్, మందు బాటిల్ వద్దా అని వరుణ్ పంచ్ వేస్తే..పొద్దునే వద్దులే అంటూ జోక్‌లు పేల్చారు. అనంతరం తలుపు తెరవడంతో గార్డెన్‌ ఏరియాలోకి వచ్చారు. ఈ సందర్భంగా నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యులు వాళ్ల జర్ని గురించి చెప్పమని బిగ్‌బాస్‌ ఆదేశించగా..ఒక్కొక్కరు తమ జర్నీని ఎమోషనల్‌గా షేర్‌ చేసుకున్నారు.

అనంతరం ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న బాబా భాస్కర్‌ని ప్రేక్షకులు తమ ఓట్లు ద్వారా రక్షించారని చెబుతూ.. బాబాను టాప్‌5 కంటెస్టెంట్‌గా ప్రకటించారు.  అనంతరం కన్ఫెషన్ రూంకి పిలిచి బాబాకి టికెట్‌ టు ఫినాలేను అందించాడు. దీంతో ఈ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ తనను గెలిపించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ.. టికెట్ టు ఫినాలేను ఆడియన్స్‌ని డెడికేట్ చేశారు బాబా భాస్కర్.దీంతో ఏపిసోడ్‌ ముగిసింది.కాగా, మిగతా నలుగురిలో ఎవరు ఎలిమేషన్‌ అవుతారనేది నేటి ఎపిసోడ్‌ లేదా రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ :‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

రాహుల్‌ది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ : వితికా

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌!

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..!

బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!