బిగ్‌బాస్‌ ఇంట్లో నీళ్ల కోసం కొట్లాట!

2 Oct, 2019 13:37 IST|Sakshi

బిగ్‌బాస్‌ పదకొండో వారానికిగానూ జరిపిన నామినేషన్‌ ప్రక్రియ ఈసారి వినూత్నంగా జరగడమేకాక రెండురోజులు కొనసాగింది. ఇందులో బాగానే రాళ్లు పోగేసుకున్న వారు నామినేషన్‌ నుంచి తప్పించుకోగా టాస్క్‌లో వెనుకబడిన రాహుల్‌, మహేశ్‌, పునర్నవి, వరుణ్‌ ఒక్కొక్కరుగా డేంజర్‌ జోన్‌లోకి వచ్చారు. ఇక ఇంటిసభ్యులు గత రెండురోజులుగా సాదాసీదాగా గడిపారు. కడుపునిండా తిండి కూడా లేకుండా, కప్పుకోడానికి సరైన వస్త్రాలు లేక నానా కష్టాలు పడ్డారు. ఇక బిగ్‌బాస్‌ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద మెడాలియన్‌’ టాస్క్‌ ఇవ్వగా దీనికోసం ఇంటిసభ్యులు నానా హంగామా సృష్టించారు. జనాలు నీటికోసం బిందెలతో ఎలా పోట్లాడుకుంటారో.. అంతకు మించి ఇక్కడ నీటికోసం కొట్లాడుకున్నారు.

సరదాగా సాగుతున్నట్టు అనిపించినప్పటికీ నేటి టాస్క్‌లోనూ చిన్నపాటి గొడవ జరిగేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్‌లో బాబా భాస్కర్‌, వితికల మధ్య తోపులాట జరగగా వితిక ఫైర్‌ అయిన విషయం తెలిసందే! అయితే ఇక్కడ బాబా రియాక్ట్‌ అవడానికి ముందు వరుణ్‌ సీరియస్‌ అయ్యాడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకోగా మళ్లీ వరుణ్‌ వితికను బుజ్జగించాడు. కాగా నేటి ఎపిసోడ్‌లో వరుణ్‌, బాబా భాస్కర్‌కు గొడవ జరిగేలా ఉంది. ఇంట్లో ఉండాలని లేదు అంటూనే బాబా భాస్కర్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకోడానికి బాగానే కష్టపడ్డాడు. ఇక బాబా మాస్క్‌ తీసేశాడని అటు నాగార్జునతోపాటు ఇటు ఇంటిసభ్యులు ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయానికి వస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా