హిమజ అవుట్‌.. అసలేం జరుగుతోందంటే?

21 Sep, 2019 20:33 IST|Sakshi

బిగ్‌బాస్‌ తొమ్మిదో వారాంతానికి భలే ట్విస్ట్‌ఇచ్చాడు. లీకు వీరులు సైతం నోరు మెదపలేని విధంగా ఎలిమినేషన్‌ ప్రక్రియను చేపట్టి బిగ్‌బాస్‌ అంటే ఏంటో నిరూపించాడు. నామినేషన్‌లో ఉన్నదే ముగ్గురు అయితే అందులో డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. పైగా దీనికి తగ్గట్టు రిలీజ్‌ చేసిన ప్రోమోలో కొన్ని వివరాలు వెల్లడయ్యేలా దాన్ని కట్‌ చేశాడు.
(డబుల్‌ ఎలిమినేషన్‌.. రాహుల్‌ అవుట్‌!)

అయితే వాటిని అంచనా వేసుకుంటూ.. కొంతమంది తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నారు. ప్రోమో చూసిన వారెవరికైనా.. రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ఇట్టే తెలిసిపోతుంది. అయితే అంత ఈజీగా తెలిసిపోయేలా ప్రోమోను విడుదల చేశాడంటే.. అందులో ఏదో తిరకాసు ఉందంటున్నారు నెటిజన్లు. రాహుల్‌ను ఎలిమినేట్‌ చేయలేదు.. సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించారంటూ ఓ ప్రచారం జరుగుతోంది.

మరోవైపు హిమజ ఎలిమినేట్‌ అయిపోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న హిమజ ఫాలోవర్స్‌.. బిగ్‌బాస్‌పై మండిపడుతున్నారు. ఇక రేపటి నుంచి బిగ్‌బాస్‌ షోను చూడమంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. పనికి రానివాళ్లంతా షోలో ఉన్నారు.. హిమజ లేకపోతే టీఆర్పీలు కూడా రావంటూ.. ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా హిమజ ఎలిమినేట్‌ అయిందా? రాహుల్‌ను ఎక్కడికి పంపించారు? అనే విషయాలు తెలియాలంటే.. ఇంకొద్ది సమయం ఆగాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు