హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

1 Sep, 2019 23:04 IST|Sakshi

ఆదివారం ఎపిసోడ్‌ సందడిగా సాగింది. వచ్చే వారం మన కింగ్‌ మళ్లీ వస్తాడు.. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తాడంటూ రమ్యకృష్ణ తెలిపింది. ఈ వీకెండ్‌ను రమ్యకృష్ణ తన భుజాలపై మోసింది. ఇక ఆదివారం నాటి కార్యక్రమంలో.. సీన్‌ చేయండి టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ అందరూ రెచ్చిపోయి నటించారు. ఇంటి సభ్యులందరూ తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. అలీ-రవి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లోంచి పూలకుండి సన్నివేశాన్ని స్పూఫ్‌ చేశారు. అనంతరం బాబా భాస్కర్‌-శ్రీముఖి.. చంద్రముఖి పాటకు డ్యాన్స్‌కు చేశారు. వరుణ్‌-వితికా ఎఫ్‌2 సినిమాల్లోంచి వెంకటేష్‌-తమన్నా గొడవపడే సన్నివేశాలను నటించి చూపించారు. మహేష్‌-శివజ్యోతి-హిమజ.. రంగస్థలంలోని సన్నివేశాన్ని స్పూఫ్‌ చేశారు. రంగమ్మత్తగా శివజ్యోతి, సమంతగా హిమజ, రామ్‌చరణ్‌ పాత్రలో మహేష్‌ నటించారు.

నామినేషన్‌లో ఉన్న ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్‌ కావాలని అనుకుంటున్నారో.. వాళ్లకి ఓ గులాబీ పువ్వు ఇచ్చి కారణం చెప్పాలని తెలిపింది. దీంతో మహేష్‌కు నాలుగు, పునర్నవి, హిమజకు రెండేసి గులాబీ పూలు వచ్చాయి. అయితే మహేష్‌ సేవ్‌ అయినట్లు రమ్యకృష్ణ ప్రకటించింది. అనంతరం హౌస్‌లోకి రమ్యకృష్ణ వచ్చింది.

హౌస్‌మేట్స్‌ అందరికీ బిగ్‌బాస్‌ టీ షర్ట్స్‌ను పంపించారు. వాటిపై వారందరికీ సరిపోయే ఓ క్యాప్షన్‌ను కూడా ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. అలీ-హ్యూమన్‌ బుల్‌డోజర్‌, వరుణ్‌- మేడమ్‌ వాళ్ల ఆయన, రాహుల్‌- పట్టుపట్టని విక్రమార్కుడు, బాబా భాస్కర్‌- మాస్క్‌ మ్యాన్‌, రవికృష్ణ- ఉదయించని సూర్యుడు, శ్రీముఖి-పంచాయితీ స్పెషలిస్ట్‌, పునర్నవి-లేడీ మోనార్క్‌, మహేష్‌-బాబా గారి బంటు, హిమజ- మిస్‌ ఆరాటం, వితికా- సర్‌ వాళ్ల ఆయన, శివజ్యోతి- సిల్లీ సిస్టర్‌.. అంటూ క్యాప్షన్స్‌ ఇవ్వగా.. వాటిపై బాబా భాస్కర్‌ కామెంట్లు చేస్తూ ఉన్నాడు.

అనంతరం వినాయక చవితి సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి.. ఈ వారం నో ఎలిమినేషన్‌ అంటూ రమ్యకృష్ణ ప్రకటించింది. అయితే.. కన్ఫెషన్‌ రూమ్‌కు వెళ్లిన అలీ, రవిలకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీకి సంబంధించిన క్లూ ఇవ్వడానికే పిలిచినట్లు అనిపిస్తోంది. శిల్పా చక్రవర్తి హౌస్‌లోకి స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వబోతోందని ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లోనే ఎంట్రీ ఇస్తుందా? లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
(బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురిలో కెప్టెన్‌ కాబోయేదెవరు?

బిగ్‌బాస్‌.. డైరెక్షన్‌ చేస్తోన్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌ 3: తెరపైకి కొత్త వివాదం!

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. ప్చ్‌ పాపం!

బిగ్‌బాస్‌: పునర్నవి లవ్‌ ట్రాక్‌ రాహుల్‌తో కాదా?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్స్‌లో ఉన్నది ఎవరంటే?