బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

11 Oct, 2019 12:35 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 కథ కంచికి చేరుతోంది. బిగ్‌బాస్‌ ఇంట్లో 80 రోజులు పూర్తయ్యాయి. ఫైనల్‌ ట్రోఫీ అందుకోడానికి మరో 20 రోజులు మాత్రమే ఉంది. రోజులు దగ్గరవుతున్న కొద్దీ బిగ్‌బాస్‌ టాస్క్‌లకు పదును పెట్టడం మానీ ఇప్పటికీ ఫన్నీ టాస్క్‌లతోనే ఎపిసోడ్‌లను నెట్టుకొస్తున్నాడు. అటు ఇంటి సభ్యులు కూడా సీరియస్‌గా కష్టపడుతున్న దాఖలాలు లేవు. బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ఇచ్చిన హిట్‌ అండ్‌ హంట్‌ టాస్క్‌లో వారి మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు. కానీ ఇంటి సభ్యులు ఇదంతా తెలిసిందే అన్నట్టుగా లైట్‌ తీసుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ ప్లాన్‌ ఫెయిల్‌ అయింది. సీరియస్‌ టాస్క్‌ మానుకుని మళ్లీ సరదా టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్‌​ చేశారు.

బర్త్‌డే సందర్భంగా ఇంటిసభ్యులతో డాన్స్‌లు చేయించాడు, కేక్‌లు పంపించాడు. దీంతో  వావ్‌ అంటూ ఆదుర్దాగా తిన్నవాళ్లతోనే నాలుగు కేక్‌లు వరుసపెట్టి పంపించి వామ్మో, మాకొద్దు బాబోయ్‌ అనేలా చేశాడు. దీంతో బిగ్‌బాస్‌ పుట్టినరోజు వీరి చావుకొచ్చినట్టయింది. బిగ్‌బాస్‌ బర్త్‌డే వేడుకలు నేటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనున్నాయి. బిగ్‌బాస్‌ నిద్రకు ఇంటి సభ్యులు ఎవరూ ఆటంకం కలిగించకూడదని ఆదేశాలు జారీ చేశాడు. దీంతో ఇంటిసభ్యులు మౌనవ్రతం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సైలెంట్‌గా చిలిపి పనులు చేస్తూ, ఒకరినొకరు ఆటపట్టిస్తూ గడుపుతున్నారు. ఇక వీరు అల్లరి మాని నిశ్శబ్దంగా ఉంటారా అన్నది సందేహమే! మరి వీరి పనుల వల్ల బిగ్‌బాస్‌ నిద్రకు భంగం కలిగిందా, లేదా అనేది నేటి ఎపిసోడ్‌లో చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు