బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

20 Jul, 2019 11:38 IST|Sakshi

దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టీవీ షోలలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఒకటి. హిందీలో ఇప్పటికే బిగ్‌బాస్‌ 12వ సీజన్‌ ముగిసింది. త్వరలోనే 13వ ఎడిషన్‌ రానుంది. ఇక, తమిళంలో బిగ్‌బాస్‌-3 ప్రారంభం కాగా.. తెలుగులో రేపు (ఆదివారం) బిగ్‌బాస్‌-3 అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. ఈసారి సీనియర్‌ నటుడు, అక్కినేని నాగార్జున బిగ్‌బాస్‌-3కి హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో ఈసారి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.  ఈ షో పట్ల జనాలకు ఉన్న ఆసక్తి నేపథ్యంలో పలు కథనాలు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్‌-3లోకి ఎంటరయ్యే కంటెస్టెంట్స్‌ వీరేనంటూ ఓ జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ జాబితా ప్రకారం చూసుకుంటే.. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో న్యూస్‌ యాంకర్‌ తీన్‌మార్‌ సావిత్రి, జర్నలిస్టు జాఫర్‌, యాంకర్‌ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్‌ సందేశ్‌, అతడి భార్య వితికా షేరు, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్‌స్మాష్‌ స్టార్‌), రఘు మాస్టర్‌‌, ఫన్‌ బకెట్‌ మహేష్‌ విట్టా, తమన్నా సింహాద్రిలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. 

ఈసారి షో ఫార్మెట్‌ను బిగ్‌బాస్‌ నిర్వాహకులు కొంత మార్చారు. గత బిగ్‌బాస్‌ హౌజ్‌లో సామాన్యులకు ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి అలాంటి ప్రయోగమేమీ చేయడం లేదు. ఈసారి హౌజ్‌లో దాదాపు అందరూ ప్రముఖులే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా, టీవీ రంగాలతోపాటు మీడియా, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ స్టార్లకు ఈసారి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌-3 షో గురించి అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ను మార్చబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ‘గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌’ను ఉపయోగించి.. ఆన్‌లైన్‌లో వచ్చిన ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. అయితే, ఈసారి ఎలిమినేషన్‌ ప్రక్రియ హాట్‌స్టార్‌ ఓటింగ్‌ ద్వారా, ఫోన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా చేపట్టవచ్చునని వినిపిస్తోంది. ఇదెంత వరకు నిజమో రేపటి నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌-3షోతో తేలిపోనుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు