బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

4 Nov, 2019 08:54 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్‌తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. మెగాస్టార్‌ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విజేతగా నిలిచిన రాహుల్‌, రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్‌  గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్‌ డాన్సులు వేశారు.

షో నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు లెజెండ్స్‌ చేతులమీదుగా టైటిల్‌ తీసుకోవడం అదృష్టంగా అనిపిస్తుంది. నా లైఫ్‌ చేంజ్‌ అవుతది అనిపిస్తుంది. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించినందుకు నా సంతోషానికి హద్దులు లేవు. మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్‌ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా సక్సెస్‌కు కారణమయింది’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అతని అభిమానులు రాహుల్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రాహుల్‌ వారితో కాసేపు ముచ్చటించాడు. ఇక శ్రీముఖి టైటిల్‌ గెలవకపోయినా కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందని మెగాస్టార్‌ చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే షో నుంచి వచ్చాక అభిమానులు తనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి?

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?