సెంచరీ దాటిన బిగ్‌బాస్‌ జర్నీ సాగిందిలా..

4 Nov, 2019 12:44 IST|Sakshi

ప్రేక్షకులను వంద రోజులకు పైగా అలరించిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 నిన్న(ఆదివారం) ఘనంగా ముగిసింది. అయితే, కంటెస్టెంట్లకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన బిగ్‌బాస్‌ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లను బీట్‌ చేస్తుందనుకున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకుంది. విన్నర్‌ ఎంపికలో ఈసారి బిగ్‌బాస్‌ న్యాయం చేయలేకపోయాడని కొందరు వాదిస్తున్నారు. ఏ ప్రాతిపదికన రాహుల్‌ సిప్లిగంజ్‌ను విజేతగా ప్రకటించారో చెప్పాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కూడా కెప్టెన్‌గా ఎంపికవ్వని రాహుల్‌కి టైటిల్‌ కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్న కొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. ఈక్రమంలో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 హైలైట్స్‌ ఓసారి పరిశీలిస్తే.. 

బిగ్‌బాస్‌ 3 కొనసాగిందిలా..
1. హోస్ట్‌గా కింగ్‌ నాగార్జున
2. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు
3. దంపతుల జంట వరుణ్‌, వితికలు రావడం
4. ఆరోవారంలో రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించడం స్పెషల్‌ అట్రాక్షన్‌
5. ఆరోవారం నో ఎలిమినేషన్‌
6. ఎనిమిదో వారంలో స్పెషల్‌ గెస్ట్‌గా బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ రావడం
7. తొమ్మిదో వారం రాహుల్‌ ఫేక్‌ ఎలిమినేషన్‌ అండ్‌ రీఎంట్రీ
8. పన్నెండోవారం హౌస్‌లో బిగ్‌బాస్‌ బర్త్‌డే వేడుకలు
9. బిగ్‌బాస్‌ హౌస్‌లో పలువురు సెలబ్రిటీల సందడి

  • ‘గ్యాంగ్‌ లీడర్‌’ తారాగణం నాని, వెన్నెల కిశోర్‌ 
  • ‘గద్దలకొండ గణేష్‌’ చిత్ర యూనిట్‌, వరుణ్‌ తేజ్‌
  • ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్ర యూనిట్‌ రామ్‌, నిధి అగర్వాల్‌
  • ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ
  • దీపావళికి యాంకర్‌ సుమ బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి

10. పదమూడోవారం కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించడం
11. బిగ్‌బాస్‌ 105 రోజుల పాటు కొనసాగింది.(జూలై 21న ప్రారంభమై నవంబర్‌ 3న ముగిసింది)
11. గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం
12. టైటిల్‌ విజేతగా రాహుల్‌, రన్నరప్‌గా శ్రీముఖి నిలవటడం

మైనస్‌గా మారినవి..
1. మెప్పించని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు
2. టాస్క్‌లు పదేపదే రద్దు చేయడం
3. ఎమోషన్స్‌ను ఎలివేట్‌ చేస్తూ సాగదీయడం
4. గత సీజన్‌ల టాస్క్‌లు కాపీ కొట్టడం
5. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం
6. లీకులు అరికట్టలేకపోవడం
7. చుట్టుముట్టిన వివాదాలు

మరిన్ని వార్తలు