సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

27 Sep, 2019 16:38 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లు.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు.ఇరవై నాలుగు గంటలు వారితో వారే పోట్లాడుకుంటూ.. మాట్లాడుకుంటూ.. ఉంటారు. బిగ్‌బాస్‌ చూసే ప్రేక్షకులకంటే.. వారితో ఉండే తోటి కంటెస్టెంట్లకే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు చూపించే పుటేజ్‌కేవలం గంట మాత్రమే.. బిగ్‌బాస్‌ నిర్వాహకులు రోజంతా జరిగింది చూపించలేరు.

వారికి ఉపయోగపడేది, టీఆర్పీలు పెంచుకునే విధంగా ఉండేట్టు గంట వ్యవధికి సరిపోయే అంతగా కట్‌ చేసి వేస్తారు. వాటిని చూసి మనం డిసైడ్‌ చేసేస్తుంటాం. అయితే మనకు చూపించే వాటిలో గొడవలుంటాయి. కానీ వాటికి సంబంధించిన కారణాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు.. మళ్లీ వారంతా ఇట్టే కలిసిపోతుంటారు. కానీ మనకు వాటన్నంటిని విపులంగా చూపించడం కుదరదు. ఇలా ఒక కంటెస్టెంట్‌ను వారు హీరోను చేయగలరు..జీరోను చేయగలరు.

అయితే శ్రీముఖికి బిగ్‌బాస్‌ డైరెక్టర్స్‌ టీమ్‌లో అభిషేక్‌, శ్యామ్‌ అనే ఇద్దరు స్నేహితులున్నట్లు హిమజ బయటపెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయం శ్రీముఖే తనకు చెప్పినట్లు వెల్లడించింది. ఆమె తరుచు కెమెరాల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చేదని.. ఈ టాస్క్‌ బాగా లేదని, ఇంకోటి ఇవ్వమని ఇలా ఏదోకటి కెమెరా దగ్గరకు వెళ్లి చెప్పుకునేదని హిమజ తెలిపింది. 

అందుకే మొదటి నుంచి శ్రీముఖికి అనుకూలంగా షోను కట్‌ చేస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టే.. శ్రీముఖిపైనే ఫోకస్‌ పెట్టి, ఆమె కామెడీ చేసినా, ఖాళీగా కూర్చున్న ఆమెకు సంబంధించిన పుటేజ్‌ ప్లే చేస్తున్నారని ఫైర్‌ అవుతున్నారు.  మరి ఈ వార్తలను శ్రీముఖి ఫాలోవర్స్‌ ఖండిస్తున్నా.. బిగ్‌బాస్‌ డైరెక్టర్లు శ్రీముఖి ఫ్రెండ్స్‌ అనే న్యూస్‌ పెద్ద మొత్తంలో ట్రెండ్‌ అవుతోంది.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు