బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

1 Nov, 2019 16:39 IST|Sakshi

బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో తెలుగునాట అందరూ బిగ్‌బాస్‌ జపం చేస్తున్నారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు పక్కవాళ్ల ఫోన్లు లాక్కుని మరీ ఓట్లు గుద్దుతున్నారు. అంతేనా, ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్‌ సమరంలో ఎవరు నెగ్గుతారు? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్‌లో సమాధానం దొరకనుండగా.. ఇప్పటినుంచే జనాలు టీవీలకు అతుక్కుపోయారు.

ఇక శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, అలీ రెజా, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌ టాప్‌ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్‌లో చాలా వెనుకబడిపోయారు. దీంతో వీళ్లు టైటిల్‌ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక వరుణ్‌కు అభిమానుల మద్దతు గట్టిగానే ఉన్నప్పటికీ టైటిల్‌ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మాత్రం ఒకరిని మించి మరొకరు ఓటింగ్‌లో దుమ్ము లేపుతున్నారు. గత రెండు రోజుల్లో ఓట్లరేసులో కాస్త వెనుకబడ్డ రాహుల్‌ ప్రస్తుతం శ్రీముఖిని అధిగమించినట్లు సమాచారం. అయితే నేడు కూడా ఓటింగ్‌కు అవకాశం ఉండటంతో ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్‌ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది ఆదివారం తేలనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

బిగ్‌బాస్‌: శ్రీముఖి కోసం డ్యాన్స్‌ పోటీలు!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’