అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

29 Oct, 2019 12:23 IST|Sakshi

కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. 100 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్‌బాస్‌ షో సెంచరీ కొట్టింది. బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఒక ప్రేక్షకురాలిగా వస్తున్నానంటూ అడుగుపెట్టిన సుమ ఇంటి విషయాలను రాబట్టడానికి ప్రయత్నించింది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లోకి రాగానే ఇంటి సభ్యులతో బోలెడు కబుర్లను పంచుకుంది. బిగ్‌బాస్‌కే పంచ్‌లు విసురుతూ నానా హంగామా చేసింది. పనిలోపనిగా ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్‌ ఆడించింది.

ఆ గేమ్‌లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన వరుణ్‌ను విజేతగా ప్రకటించింది. అయితే.. సుమ ఇంట్లోకి రాగానే మొదటగా.. టపాకాయలు తెచ్చావా అని హౌస్‌మేట్స్‌ ప్రశ్నించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ తనవెంట ఏమీ తీసుకురాలేదని సుమ చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యుల ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న బిగ్‌బాస్‌ దీపావళి పండగను జరుపుకోడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకోసం వారికి టపాకాయలు అందించినట్టు కనిపిస్తోంది. దీంతో దొరికిందే చాన్స్‌ అన్నట్టుగా ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. వీరి అల్లరికి సుమ తోడవగా.. దీపావళి వేడుకలతో హౌస్‌ వెలుగులీనేలా ఉంది. ఇంటి సభ్యులు కాకర పువ్వొత్తులను చేతపట్టుకుని ఆనందంతో డాన్స్‌లు చేస్తున్నారు. ఇక ఈ సంబరాలను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

బిగ్‌బాస్‌: శ్రీముఖి కోసం డ్యాన్స్‌ పోటీలు!

బిగ్‌బాస్‌ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’

బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..

బిగ్‌బాస్‌: దోస్తులతో శివజ్యోతి సంబరాలు!

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్‌

బిగ్‌బాస్‌ నిర్వాహకుల అనూహ్య నిర్ణయం

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..