ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

2 Sep, 2019 17:31 IST|Sakshi

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అన్నది బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడూ ప్రత్యేకమే.. మొదటి సీజన్‌లో నవదీప్‌, రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను  ఎంటర్‌టైన్‌ చేశారు. ఇక మూడో సీజన్‌కు వచ్చేసరికి ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడమూ, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చి.. సంచలన కామెంట్లు చేసి, హౌస్‌మేట్స్‌తో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది.
(బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

ఇక మళ్లీ ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు తెలుస్తోంది. ఏడో వారంలో ఈమె హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్‌ మీడియాలో నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం.. యాంకర్‌, హోస్ట్‌గా ఫేమస్‌ అయిన శిల్పా చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయమై.. హౌస్‌మేట్స్‌ను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిపించి ఆమెను గుర్తుపట్టేలా ఓ టాస్క్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆ అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి ఎవరన్నది హౌస్‌మేట్స్‌ గుర్తించలేకపోతున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు ఆ వ్యక్తి దర్శనమివ్వనుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు