బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

4 Nov, 2019 10:38 IST|Sakshi

జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌-3 నవంబర్‌ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్‌ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీముఖి విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. రాహుల్‌ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే... శ్రీముఖితో వైరం రాహుల్‌కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్‌ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్‌ చేసిన ప్రతీసారి అతని బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రాహుల్‌ చివరాఖరికి ఇంటి సభ్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. 


పాటల మాంత్రికుడు.. 
బద్ధకస్తుడు అన్న పేరును తెచ్చుకున్న రాహుల్‌ మొట్టమొదటగా ‘టికెట్‌ టు ఫినాలే’ సాధించి తనేంటో రుజువు చేసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పడం.. ఎలాంటి భేషజాలానికి పోకుండా తప్పు చేస్తే సారీ చెప్పడం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రాహుల్‌ హైదరాబాదీ యాసతో ఇంటి సభ్యులు కొన్నిసార్లు నొచ్చుకున్నారు. రాహుల్‌ తమను తిడుతున్నాడని హోస్ట్‌ నాగార్జునకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగ్‌ సైతం రాహుల్‌ను జాగ్రత్తగా మాట్లాడాలని సూచించాడు. అయితే, ప్రేక్షకులు మాత్రం రాహుల్‌ బోల్డ్‌ రియాక్షన్స్‌కి ఫిదా అయ్యారు. వీటన్నిటికీ తోడు రాహుల్‌ కొత్తకొత్త బాణీలతో, తన గాత్రంతో అటు ఇంటి సభ్యులను, ఇటు ప్రేక్షకులను అలరించాడు. ఫేక్‌ ఎలిమినేషన్‌, రీఎంట్రీ రాహుల్‌ క్రేజ్‌ను రెట్టింపు చేశాయి. రాహుల్‌ ఫేక్‌ ఎలిమినేషన్‌ సమయంలో పునర్నవీ, పున్నూ ఎలిమినేషన్‌ సమయంలో రాహుల్‌ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు కూడా ఫీల్‌ అయ్యారు. సింగర్‌, నటుడు నోయెల్‌.. రాహుల్‌కు అండగా నిలవటం అతనికి మరింత ప్లస్‌ అయ్యింది.

మిడిల్‌ క్లాస్‌+వృత్తికి గౌరవం
మరీ ముఖ్యంగా రాహుల్‌ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, అతను లైఫ్‌లో ఇంకా సెటిల్‌ అవాల్సి ఉందని కూడా జనాలు గెలిపించేందుకు ఓ కారణమైంది. తన బార్బర్‌ వృత్తికి గౌరవం ఇవ్వడం కూడా అతని విలువను రెట్టింపు చేసింది. గల్లీ సింగర్‌ నుంచి ఎదిగిన తీరును దగ్గరుండి చూసిన జనం అతనికి జై కొట్టారు. వీటన్నింటి వల్ల రాహుల్‌కు గెలుపు ఖాయమైంది. ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవని రాహుల్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. అయితే అతని గెలుపును శ్రీముఖి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బద్ధకస్తుడిని గెలిపించి బిగ్‌బాస్‌ 3 ఫెయిల్‌ అయిందని తిట్టిపోస్తున్నారు. రాహుల్‌ గెలుపు.. శ్రీముఖి వేసిన భిక్షగా అభివర్ణిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి?

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ఆ రోజు నుంచి ‘బిగ్‌బాస్‌’ కనిపించదు..

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది