ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

15 Oct, 2019 17:56 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో మహేశ్‌కు, శ్రీముఖికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికీ తెలిసిందే! పన్నెండో వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘హంట్‌ అండ్‌ హిట్‌’ టాస్క్‌తో ఇది మరింత తేటతెల్లం అయింది. శ్రీముఖిని పంపించాలని చూసినప్పటికీ చివరికి మహేశ్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌ను వీడక తప్పలేదు. ఇక మహేశ్‌.. తననే టార్గెట్‌ చేశాడని గ్రహించిన శ్రీముఖి కూడా అతని మాటలకు గట్టి కౌంటర్లే ఇస్తూ వచ్చింది. మహేశ్‌ ఎలిమినేట్‌ అయ్యాడని నాగ్‌ ప్రకటించినప్పుడు బాబా తప్ప ఇంటిసభ్యులెవరూ పెద్దగా బాధపడినట్లు కనిపించలేదు. తన గురువు అంటూ బాబా భాస్కర్‌కు పాద నమస్కారం చేసి అతనిపై భక్తి, ప్రేమలను చాటుకున్నాడు.

ఎలిమినేషన్‌ రోజు కూడా మహేశ్‌, శ్రీముఖి నాగ్‌ ముందే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇక మహేశ్‌ వెళ్లిపోయే ముందు శ్రీముఖితో పనుందంటూనే ఏమీ చెప్పకుండానే సెలవు తీసుకున్నాడు. కానీ స్టేజిపైకి వచ్చిన తర్వాత మనసులో ఉన్నదంతా కక్కేశాడు. ఇంట్లో నెంబర్‌ 1 కంటెస్టెంట్‌ బాబా తప్ప ఎవరూ లేరటూ ఘంటాపథంగా చెప్పాడు. ఇక కిచెన్‌లో అన్ని గిన్నెలు కడగాలన్న బిగ్‌బాంబ్‌ను శ్రీముఖిపై వేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. తాను గురువుగా గౌరవించే బాబాకు ఆర్డర్లు వేస్తుందని, అది తనకు ఇసుమంతైనా నచ్చదని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి ఎన్ని గిన్నెలైనా వేసేయండి అంటూ బాబాకు ఉచిత సలహా ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు