రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

28 Sep, 2019 18:48 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో పది వారాలుపూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది ఎలిమినేషన్లు, మూడు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి. అయితే ఈ పదో వారంలో రెండు పెద్ద సంఘటనలు జరగడం విశేషం. ఎంతో సన్నిహితంగాఉండే వరుణ్‌-రాహుల్‌ మధ్య గొడవ జరగడం.. ఎలిమినేట్‌ అయిన అలీ రెజా తిరిగి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడం.

అయితే వరుణ్‌-రాహుల్‌ మధ్య జరిగిన గొడవ ఇంకా చల్లారలేదు. వీరిద్దరి మధ్య దూరం పెరిగేట్టు కనిపిస్తోంది. అయితే ఆ నలుగురు కలిసి ఉంటేనే.. బలమన్న సంగతి లోపల ఉన్న వారికి తెలియదు. మరి నాగార్జున వచ్చి వీరి మధ్య దూరాన్ని తగ్గిస్తాడా? లేదా? అన్నది చూడాలి. అయితే రాహుల్‌ మాత్రం వితికాతో ఇక మాట్లడను అని పున్నుతో చెప్పుకొచ్చని సందర్భాన్ని చూశాం. మరి ఈ నలుగురు మళ్లీ ఒక్కటవుతారా?లేదా అన్నది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు