బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కోరిక నెరవేర్చిన నాగార్జున

17 Dec, 2019 20:21 IST|Sakshi

వెండితెర, బుల్లితెర రెండింటినీ సమంగా బ్యాలెన్స్‌ చేస్తూ రెండుచోట్ల ప్రేక్షకాదరణను రెట్టింపు చేసుకున్న హీరో కింగ్‌ నాగార్జున. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ 3 రియాలిటీ షో ఈమధ్యే ఘనంగా ముగిసింది. ఇందులో నాగ్‌ పార్టిసిపెంట్లతో ఓవైపు ప్రేమగా మాట్లాడుతూనే అవసరమైనపుడు మందలించేవాడు కూడా. ఇక బిగ్‌బాస్‌తో క్రేజ్‌ రెట్టింపైన వ్యక్తుల్లో అలీరెజా ఒకరు. అతను బుల్లితెర అర్జున్‌రెడ్డి అన్న పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇక అలీ ఎలిమినేట్‌ అయినపుడు పార్టిసిపెంట్లతోపాటు ఆయన అభిమానులు కూడా కంటతడి పెట్టారు. దీంతో బిగ్‌బాస్‌ యాజమాన్యం అ​తడిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో తిరిగి ఇంట్లోకి పంపించింది.

అలీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నన్ని రోజులు స్టైలిష్‌గానే ఉండటానికే ప్రయత్నించాడు. నాగ్‌ కూడా చాలాసార్లు నీ స్టైల్‌ నచ్చుతుంది అంటూ పొగిడేవాడు. అయితే వీకెండ్‌లో ఓసారి నాగ్‌ ధరించిన బ్రాండెడ్‌ షూ కావాలని అలీ కోరాడు. దానికి నాగ్‌ ఓకే చెప్పాడు. ఆ తర్వాత షో ముగిసింది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో నాగ్‌.. అలీరెజాకు బ్రాండెడ్‌ షూను గిఫ్ట్‌ ఇచ్చాడు. షో పూర్తయి నెల రోజులు దాటిపోయినా గుర్తుపెట్టుకుని మరీ తన కోరిక నెరవేర్చడంతో అలీ రెజా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. నాగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్లు మరోసారి ఒకేవేదికపై కనిపించనున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం అంతా ఒక చోటికి చేరి నానాహంగామా చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు