నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

8 Oct, 2019 00:49 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 పన్నెండో వారం నలుగురు నామినేట్‌ అయ్యారు. ఇంటి సభ్యులందరికి బిగ్‌బాస్‌ సోమవారం పార్కింగ్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా గూడ్స్‌ ట్రాలీని నిర్దేశిత ప్రాంతంలో పార్కింగ్‌ చేయాలి. పార్కింగ్‌ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అవుతారు. తొలుత హౌజ్‌లో ఉన్న ఎనిమిది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్‌ స్థలాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అలా నాలుగుసార్లు పార్కింగ్‌ స్థలాలు తగ్గిస్తూ ఉండటంతో నలుగురు సభ్యులు నామినేట్‌ అయ్యారు. 

మొదటగా వరుణ్‌, తర్వాత వితిక, అటు తర్వాత మహేశ్‌, చివరగా రాహుల్‌ పార్కింగ్‌లో చోటు దక్కించుకోలేదు. దీంతో ఈ నలుగురు నామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే, పోయిన వారం జరిగిన టాస్క్‌లో వితిక బ్యాటిల్‌ ఆఫ్‌ మెడాలియన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌తో వితికకు ఒక వారం ఎలిమినేషన్‌ తప్పించుకునే అవకాశం దక్కింది. ఇక సోమవారం జరిగిన టాస్క్‌లో వితిక ట్రాలీ పార్కింగ్‌ చేయడంలో విఫలం కావడంతో నామినేట్‌ అయింది. అయితే, ఈవారం మెడాలియన్‌ను వాడుకుని సేవ్‌ అవుతారా..? లేదంటే నామినేషన్‌లో ఉంటారా..? అని బిగ్‌బాస్‌ అడగ్గా.. వితిక మెడాలియన్‌తో సేవ్‌ అవుతానంది. దీంతో మిగిలిన ముగ్గురే నామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. 

ఆసక్తికరంగా.. ఉత్కంఠగా టాస్క్‌..!
ఇక ట్రాలీ పార్కింగ్‌ టాస్క్‌ ఆసక్తికరంగా.. కాస్త ఉత్కంఠగా సాగింది. ఓ సమయంలో రాహుల్‌, బాబా భాస్కర్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను బాబా బ్యాచ్‌ టార్గెట్‌ చేసిందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. బాబా కావాలనే అందర్నీ ఆపేసి.. శ్రీముఖి, శివజ్యోతి వెళ్లేందుకు సహాయం చేస్తున్నాడని ఆరోపించాడు. బాబా  తన దారికి అడ్డు రావడం వల్లే కింద పడ్డానని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. అయితే, తన దృష్టంతా పార్కింగ్‌ చేయడంపైనే ఉందని, తాను కావాలని ఎవరినీ అడ్డుకోలేదని బాబా స్పష్టం చేశాడు. మరి టాస్క్‌ మొదలైనప్పుడు తనకు అలీకి మధ్యన ఉన్న శివజ్యోతి.. మూడో రౌండ్‌ తర్వాత బాబావైపునకు ఎలా వెళ్లిందని ప్రశ్నించాడు. 

బాబా కావాలనే శివజ్యోతిని సేవ్‌ చేయాలని ప్లాన్‌ చేశాడని ఆరోపించాడు. అందువల్ల మిగతావారికి ఇబ్బంది కలిగిందని చెప్పాడు. గేమ్‌ స్టార్టింగ్‌ లైన్‌లో మూడో స్థానంలో ఉన్న తాను బాబా వల్ల చివరకు వెళ్లాల్సి వచ్చిందని రాహుల్‌ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై బాబా స్పందిస్తూ.. శివజ్యోతి అప్పటికే తన పక్కన నిలబడ్డానికి వచ్చిందని.. ఆడపిల్ల కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సరే అన్నానని చెప్పాడు. రాహుల్‌ను.. మరెవరినీ టార్గెట్‌ చేసే ఉద్దేశం తనకు లేదని సమాధానమిచ్చాడు. అందరి తప్పులకు దేవుడే సాక్షి అని బాబా పేర్కొన్నాడు. ఇక టాస్క్‌ చివరి రౌండ్‌ (నాలుగు)లో కిందపడటంతో శివజ్యోతి  కాలు బెనికింది. దీంతో ఆమెను మెడికల్‌ రూమ్‌కు తీసుకెళ్లాలని బిగ్‌బాస్‌ సూచించాడు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది.

Poll
Loading...
మరిన్ని వార్తలు